English   

కరోనా వైరస్‌తో బుల్లితెర ఎన్ని వందల కోట్లు నష్టపోయిందంటే..

tv
2020-05-26 06:39:05

బుల్లితెరకు కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఎలాగోలా సినిమాలు వేసేద్దాం.. స్లాట్స్ నింపేద్దామంటే కుదరని పని ఇప్పుడు. వేసిన సినిమాలు మళ్లీ మళ్లీ వేస్తుంటే రేటింగ్స్ రావడం లేదు. అలాగని స్లాట్స్ నింపలేకుండా ఉండలేని పరిస్థితి. మరోవైపు ఏ మాత్రం కరుణ లేని కరోనా వైరస్ ఇండియాను నిర్ధాక్షణ్యంగా నాశనం చేస్తుంది. దీని వల్ల అన్ని ఇండస్ట్రీలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. వేల కోట్ల నష్టాలను చవి చూస్తున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అయితే గత రెండు నెలలుగా పూర్తిగా ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయింది. రాబోయే రెండు నెలలు కూడా థియేటర్లు ఓపెన్ చేసే ఆలోచనలు కనిపించడం లేదు. దాంతో పాటు టెలివిజన్ ఇండస్ట్రీ కూడా దారుణంగా నష్టపోతుంది. సినిమాలు లేకపోతే హాయిగా టీవీ చూసుకోవచ్చు అనుకునే వాళ్లకు ఇప్పుడు అది కూడా షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. షూటింగ్స్ అన్ని పూర్తిగా ఆపేయాలని ఆర్డర్స్ రావడం.. దానికి తోడు లాక్ డౌన్ కూడా కావడంతో సీరియల్ యాక్టర్స్ కూడా అంతా ఇంటికి పరిమితం అయిపోయారు.

ఈ వైరస్ కారణంగా భయపడే వాళ్ళు కూడా ఇల్లు దాటి బయటకు రావడం లేదు. దాంతో సీరియల్ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. రియాలిటీ షోలు మ్యూజికల్ షోలు ఇలా అన్నీ షూటింగ్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాంతో టెలివిజన్ లో స్లాట్స్ ఎలా ఫిల్ చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు యాజమాన్యం. ఇప్పటి వరకు కొన్ని పాత సినిమాలు, కొత్త సినిమాలు, రియాలిటీ షో లు అన్ని రిపీట్ చేస్తున్నారు. మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా భారీ నష్టాల్లో కూరుకుపోతాం అంటున్నారు వాళ్ళు. ఇప్పటికే లాక్‌డౌన్ ఎఫెక్ట్ వలన టీవీ ఇండస్ట్రీకి నెలకు దాదాపు 500 కోట్లు నష్టం వస్తుందని తెలుస్తుంది. తెలుగు ఛానల్స్ లో సుమారు 60 సీరియళ్లు.. 20 షోలు నడుస్తున్నాయని లెక్కలు చెబుతున్నాయి. వీటన్నింటి కోసం దాదాపు 7 వేల మంది పని చేస్తున్నారు. గత రెండు నెలలుగా వాళ్లందరికీ పని లేకుండా పోయింది. అలాగే ఒకప్పుడు మెయిన్‌స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ యాడ్ రెవెన్యూ నెలకు 500 కోట్ల రూపాయలు ఉంటే.. ఇప్పుడు అది 100 కోట్లకు పడిపోయింది. యాడ్ రెవెన్యూ 30 శాతం తగ్గిందని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా బుల్లితెరకు మళ్లీ పునర్వైభవం రావాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. దానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది కూడా.

More Related Stories