English   

సురేఖ వాణి సంచలన నిర్ణయం.. ఎక్కడ్నుంచి వచ్చిందో..

surekha
2020-05-26 07:24:34

తెలుగు ఇండస్ట్రీలో సురేఖ వాణి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్న చిన్న సినిమాల్లోనే కాక పెద్ద సినిమాల్లోనూ ఉన్న పాత్రలే చేసింది. దానికి తోడు సీరియల్స్ లో కూడా నటించింది. ఇవన్నీ ఇలా ఉంటే ఈమెకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కూతురితో కలిసి మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని డాన్సులు చేస్తూ నానా రచ్చ చేస్తుంది ఈ సురేఖ ఆంటీ. ఈ మధ్య కూతురుతో కలిసి దిగిన కొన్ని హాట్ ఫొటోలకి వచ్చిన కామెంట్లకి సురేఖ కాస్త ఘాటుగానే స్పందించింది. కచ్చితంగా కూతుర్ని పెంచే పద్ధతి ఇది కాదు అంటూ కామెంట్ చేస్తే దానికి ఆమె వెంటనే రివర్స్ కౌంటర్ ఇచ్చింది. నీలాంటి వీధి కుక్కలు లైఫ్ ని చాలా బాగా లీడ్ చేస్తాయి. నీ మైండ్ సెట్ కి హ్యాట్సాఫ్ అని సురేఖ వాణి నెటిజన్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. దాంతో సురేఖవాణి పై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎదిగివచ్చిన కూతురుతో ఇలా అసభ్యకరమైన ఫోటోలు షేర్ చేయడమే కాకుండా  మంచి చెప్పడానికి పోతే విమర్శిస్తారా అంటూ ఆమెపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు మాత్రం సురేఖవాణి చెప్పిన దాంట్లో కూడా తప్పులేదన్న వాదనలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా కూతురుతో అలాంటి ఫోటోలు దిగడం మాత్రం మంచిది కాదని ఆమెకు బాహాటంగానే కొందరు సలహా ఇస్తున్నారు. అలాంటి ప్రైవేట్ ఫోటోలు ఉన్నప్పుడు దాచుకోవాలి కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు అంటూ ఆమెకు హితవు పలుకుతున్నారు. ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే ఈ మధ్య సినిమాలు చేయడమే తగ్గించేసింది.. అలా అనడం కంటే కూడా అవకాశాలు రావడం తగ్గిపోయాయంటే బెటర్ ఏమో. దాంతో ఇప్పుడు టీవీ వైపు చూస్తుంది సురేఖా వాణి. నిజానికి ఆమె కెరీర్ అక్కడే మొదలైంది. సురేష్ తేజ తెరకెక్కించిన మొగుడ్స్ పెళ్లామ్స్, హార్ట్ బీట్ లాంటి షోలు చేసింది. ఆ తర్వాత ఆ దర్శకున్నే పెళ్లి చేసుకుంది. 2019, మే 6న సురేష్ తేజ మరణించాడు. ఆ తర్వాత కూడా తన కూతురుతో హాట్ డాన్సులు చేస్తూ విమర్శల పాలవుతుంది సురేఖా వాణి. ఇదిలా ఉంటే కూతుర్ని హీరోయిన్ గా పరిచయం చేయాలని చూస్తుంది ఈ ఆంటీ.

 

More Related Stories