బాలయ్యకి కథ రెడీ చేసిన అనిల్ రావిపూడి..సరే అంటే నెక్స్ట్ అదే

కళ్యాణ్ రామ్ కెరీర్లో 'అతనొక్కడే' తర్వాత హిట్ కోసం చాలా సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు. అలాంటి ఆయనకు ‘పటాస్’ తో హిట్ ఇచ్చాడు అనిల్. ఆ సినిమా కళ్యాణ్ రామ్ తో పాటు అనీల్ రావిపూడికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత సుప్రీం, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో మంచి ఫాంలోకి వచ్చాడు అనిల్. రాజా ది గ్రేట్ సమయంలోనే బాలయ్యతో అనీల్ రావిపూడి సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. గతంలో అనీల్ రావిపూడి ఒక కథను బాలయ్యకు వినిపించాడని, ఆ కథతో సినిమాను చేయాలని బాలయ్య భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఆ చిత్రం వర్కౌట్ కాలేదు.
‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత అనిల్ వెంకటేష్ వరుణ్ తేజ్‌ల కలయికలో దిల్‌రాజు నిర్మాణంలో ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్ మూవీని చేసి హిట్ కొట్టాడు. మొన్న సంక్రాంతికి మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి బంపర్ హిట్ కొట్టాడు. అయితే స్వతహాగా నందమూరి అభిమాని అయిన అనిల్ ఎలా అయినా బాలయ్యతో ఒక సినిమా చేయాలనే ఆసక్తితో ఉన్నాడని ఆయనే మొన్న ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్న ఆయన ఎఫ్ 3 స్క్రిప్ట్ మీద గట్టిగానే కూర్చున్నాడని అంటున్నారు. అయితే అది పూర్తి చేసేసి ఇప్పటికే బాలయ్య కోసం ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే బాలకృష్ణను స్వయంగా కలిసి కథ వినిపించేందుకు కూడా రెడీ అయ్యాడట అనిల్. అన్నీ కుదిరితే ఎఫ్ 3 తర్వాత సెట్స్ పైకి బాలయ్య సినిమానే తీసుకెళ్ళి హిట్ కొట్టాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎటూ బాలయ్యకి సినిమా నచ్చితే చాలు, ఎవరైతే నాకేంటి అన్నట్టు ఉంటారు, మరి చూడాలి ఏమవుతుందో ?