English   

బాలీవుడ్ హీరోయిన్ ఆత్మహత్య.. పోలీసుల ధర్యాప్తు..

preksha
2020-05-27 08:00:07

ఈ రోజుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ముందుగా ప్రాణం తీసుకుంటున్నారు కొందరు నటీనటులు. మొన్నటికి మొన్న యువ నటుడు లాక్ డౌన్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు మరో నటి కూడా ప్రాణాలు తీసుకుంది. అయితే ఈమె మరణానికి కారణం లాక్ డౌన్ కాదని.. మరేదో ఉందంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ధర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ లో 'క్రైమ్ పెట్రోల్', 'లాల్ ఇష్క్', 'మేరీ దుర్గా' వంటి టీవీ షోలలో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైన ప్రేక్ష మెహతా మే 25 రాత్రి ఇండోర్‌లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సినిమా హీరోగా నటించిన ప్యాడ్ మ్యాన్ సినిమాలో నటించింది ప్రేక్ష.

ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. మే 25 రాత్రే ఆమె ఉరి వేసుకున్నా కూడా మరుసటి రోజు ఉదయం వరకు కుటుంబ సభ్యులు అది గమనించలేదు. ఉదయం చూసిన వెంటనే అప్రమత్తమైన ప్రేక్ష తండ్రి ఆమెను ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు వదిలేసింది.  ప్రేక్ష ఆత్మహత్యకు ముందు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన మెసేజ్ ఆమె అనుభవిస్తున్న వ్యధను బయటపెట్టింది. సబ్‌సే బురా హోతా హై సప్నోకా మార్ జానా (మీ కలలు కల్లలైనప్పుడు దానికంటే దరిద్రం మరోటి ఉండదు) అని రాసుకొచ్చింది. నాలుగు రోజుల కిందే ప్రేక్ష చివరిసారి ఓ సెల్ఫీ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. దానికి 'అగర్ తుమ్ సాత్ హో.. ' పాటను కూడా జోడించింది. రెండేళ్ల క్రితమే ముంబైలో అడుగు పెట్టిన ప్రేక్ష.. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మునపటిలా అవకాశాలు వస్తాయా రావో అనే బెంగతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. మరి చూడాలిక.. పోలీసుల ధర్యాప్తులో ఎలాంటి నిజాలు వెల్లడవుతాయో..?

 

More Related Stories