English   

అక్షయ్ కుమార్ షూటింగ్ షురూ.. లాక్‌డౌన్ తర్వాత ఫస్ట్ టైమ్..

Akshay Kumar
2020-05-27 09:11:51

లాక్‌డౌన్‌‌తో రెండు నెలలుగా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. పైగా సినిమాలు, సీరియల్స్ షూటింగ్స్ కూడా జూన్ 1 తర్వాతే మొదలు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. దానికి నిర్మాతల మండలి కూడా కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే అందరి కంటే ముందు సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఈయన చేసింది సినిమా కాదు.. లాక్‌డౌన్‌ అనంతరం బాధ్యతలకు సంబంధించిన ఓ యాడ్ కోసం ఆయన షూట్ చేసాడు. ఆర్ బాల్కీ దీనికి దర్శకుడు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ కమలిస్థాన్‌ స్టూడియోలో ఈ షూటింగ్‌ని నిర్వహించామని తెలిపారు దర్శక నిర్మాతలు. ఈ ప్రకటన ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిందని దర్శకుడు బాల్కి తెలిపాడు. ప్రస్తుతం ఈ షూటింగ్‌ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అందులో షూటింగ్ అంతా నిబంధనలకు లోబడి చేసామని చెప్పాడు దర్శకుడు బాల్కీ. 

లాక్‌డౌన్‌ తర్వాత ప్రతి ఒక్కరూ పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో అక్షయ్ కుమార్ నటించాడని తెలిపాడు బాల్కీ. ఇతరుల భద్రతతో పాటు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఇదే ఈ యాడ్ లో కూడా చూపించామని చెప్పాడు ఈ దర్శకుడు. భౌతిక దూరంతో పాటు శుభ్రంగా ఉంచిన రహదారులు.. థర్మల్ స్క్రీనింగ్.. మాస్కులు ధరించి ఇలా ఈ షూటింగ్ కోసం అన్ని కఠిన నిబంధనలు పాటించామని చెప్పాడు బాల్కీ. అలా చేసిన కొన్ని నిమిషాలకే దానికి అలవాటు పడిపోయామంటున్నాడు ఈయన. సాధ్యమైనంత వరకు చాలా తక్కువ మంది సిబ్బందితోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యాడ్ పూర్తి చేసినట్లు చెప్పాడు బాల్కీ. ఏదేమైనా కూడా లాక్‌డౌన్ తర్వాత తొలిసారి కామెరా ముందుకు వచ్చిన స్టార్ హీరోగా అక్షయ్ కుమార్ నిలిచిపోయాడు. ఈయన కరోనా కట్టడి కోసం ఏకంగా 30 కోట్ల విరాళం అందించాడు. 

More Related Stories