English   

అమ్మో భూమి.. అందంతో మాయ చేసేసావమ్మీ..

 Bhumi Pednekar
2020-05-27 09:20:29

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు మనల్ని చూసి నవ్వినోళ్లే రేపు నువ్వు అద్భుతం అంటారు. అప్పుడు వేలెత్తి చూపించిన వాళ్లే ఓ రోజు చప్పట్లు కొడతారు. బాలీవుడ్ భామ భూమి ఫడ్నేకర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకప్పుడు ఆమెను చూసి ఈమె కూడా హీరోయిన్ అవుతుందా అని ఎగతాళి చేసారు.. అసలు ఇలా ఉంటే ఎవరైనా ఈమెను హీరోయిన్ గా ఒప్పుకుంటారా అంటూ విమర్శించారు. కానీ ఆ తర్వాత మేకోవ‌ర్ అనే మాట‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయింది భూమి ఫ‌డ్నేక‌ర్. ద‌మ్ ల‌గాకే ఐసా అనే సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది భూమి. అప్పుడు ఈమె బ‌రువు 100 కేజీల పైనే. ఆ కారెక్ట‌ర్ కు త‌గ్గ‌ట్లు ఆంటీలా మారిపోయింది భూమి. ఆ త‌ర్వాత క‌ష్ట‌ప‌డి త‌గ్గింది. ఆ మధ్య అక్ష‌య్ కుమార్ టాయ్ లెట్ సినిమాలో న‌టించింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో భూమి ఇమేజ్ కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత కూడా వరసగా విజయాలతో దుమ్ము దులిపేస్తుంది ఈ బ్యూటీ. దానికి తోడు లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్ లలో హాట్ షో చేసింది భూమి. 

ఇప్పుడు అమ్మాయిగారు పిచ్చ గ్లామ‌రస్ గా మారిపోయారు. ఈమె తొలి సినిమా చూసిన‌వాళ్ల‌కు అస‌లు ఈ అమ్మాయిలో ఇంత మార్పేంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. బ‌రువు త‌గ్గ‌డమే కాదు.. సూప‌ర్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది భూమి ప‌డ్నేక‌ర్. త‌న తొలి చిత్ర హీరో ఆయుష్మాన్ ఖురానాతో వరస సినిమాలు చేస్తుంది ఈమె. ఆ మధ్య వీళ్లు క‌లిసి న‌టించిన శుభ్ మంగ‌ళ్ సావ‌ధాన్, దాని సీక్వెల్ కూడా హిట్ అయ్యాయి. గతేడాది ఈ ఇద్దరూ కలిసి నటించిన బాల కూడా హిట్ అయింది. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు పోగొడుతుంది భూమి. ఇప్ప‌డు హాట్ ఫోటోషూట్ కూడా పిచ్చెక్కించేసింది. క‌సి చూపుల‌తో మ‌తులు పోగొట్టింది భూమి. ఈమె పోజుల‌కు నిద్ర‌లు చెడిపోతున్నాయి.

More Related Stories