English   

పెళ్లి కాకుండానే బిడ్డకు తల్లైన సీనియర్ హీరోయిన్..

Shobhana
2020-05-27 09:32:14

శోభన.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేరళ నుంచి తెలుగుకు వచ్చిన మలయాళీ ముద్దుగుమ్మలో ఈమె పేరు కూడా ప్రముఖంగా ఉంటుంది. ముఖ్యంగా 1980, 90వ దశకాలలో వరస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, నాగార్జున లాంటి స్టార్ హీరోల నుంచి రాజేంద్ర ప్రసాద్ లాంటి కామెడీ హీరోల వరకు అందరితోనూ నటించి మెప్పించింది శోభన. ఈమె కళ్లకు కూడా అప్పట్లో అభిమానులున్నారు. ఈమెకు సినిమాలతో పాటు నాట్యం కూడా మరో వరం. రెండింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేసింది శోభన. కెరీర్ పరంగా పీక్స్ చూసిన ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేదనే చెప్పాలి. ముఖ్యంగా 50 ఏళ్లకు దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ పెళ్లి కాకుండానే అలాగే ఉండిపోయింది శోభన. ఆమె హీరోయిన్ గా కొనసాగినప్పుడు పెళ్లి జరగబోతుందని ఎన్నోసార్లు వార్తలొచ్చాయి. కానీ అన్నిసార్లు అవి అబద్ధాలే అయిపోయాయి.

మలయాళ ఇండస్ట్రీలో ఓ హీరోను ఘాడంగా ప్రేమించిన శోభన.. ఆ తర్వాత మోసపోయిందని తెలుస్తుంది. ఆమెను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అసలు పెళ్లే చేసుకోకూడదని ఈమె నిర్ణయించుకుందని ప్రచారం కూడా ఉ:ది. అయితే ప్రస్తుతం తన ఒంటరితనాన్ని మర్చిపోయేందుకు ఒక చిన్న పాపను దత్తత తీసుకొని ఆమె ఆలనాపాలనా చూసుకుంటోంది శోభన. పెళ్లి కాకుండా అలా ఆ పాపకు తల్లి అయిపోయింది శోభన. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యువతరం నటీనటులకు నటన, నాట్యంలో శిక్షణ ఇస్తూ జీవితాన్ని గడిపేస్తుంది శోభన. చెన్నైలోనే తన కూతురుతో నివాసం ఉంటుంది ఈ సీనియర్ హీరోయిన్. సినిమాల్లో కూడా ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి దుల్కర్ సల్మాన్ నటించిన వారనే ఆవశ్యముందే సినిమాలో కీలక పాత్రలో నటించింది శోభన. 

More Related Stories