English   

ఉపాసన పుట్టినింట తీవ్ర విషాదం

K Umapathy Rao
2020-05-27 12:34:31

రామ్ చరణ్ సతీమణి ఉపాసన పుట్టినింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉపాసన తాతయ్య, దోమకొండ గడీకి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతి రావు నిన్న రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హస్పటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వయస్సు పైబడడంతోనే ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. ఉమాపతి రావు మృతితో ఉపాసన భావోద్వేగానికి గురైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకోవడమే కాక సోషల్ మీడియా ద్వారా తన తాతయ్యకు నివాళులు అర్పించింది. మొట్ట మొదటి టీటీడీ ఈవోగా పని చేసిన ఘనత ఈయనకు దక్కుతుంది. ఇక మీరందరు కన్నీటి ద్వారా కాకుండా చిరునవ్వుతో ప్రేమని కురిపించాలంటూ ఉపాసన తన ట్విట్టర్ లో అయన ఫోటో పోస్ట్ చేసింది. ఉపాసన రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో  హాస్పిటల్స్ విస్తరణలో తన దైన పాత్ర పోషిస్తూ హాస్పిటల్ ను మరింత ముందుకు తెసుకు వెళ్తున్నారు. ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఎంతో మందికి అండగా ఆదర్శంగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

More Related Stories