English   

ఎన్టీఆర్ ఘాట్ కు రానన్న ఎన్టీఆర్...సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

NTR
2020-05-27 13:04:24

రేపు టీడీపీ వ్యవస్థాపకుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు జయంతి. అయితే ఈ సందర్భంగా ప్రతి ఏడాది కుటుంబసభ్యులు, అభిమానులు హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రస్తుతం నెల కొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆయన మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌లు గురువారం ఎన్టీఆర్‌ ఘాట్‌ కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు వారి తరపున ఒక ప్రెస్ నోట్ విడుదలయింది. తాము అక్కడికి వస్త్గే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశం ఉందని తద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి తాత గారికి నివాళులర్పించనున్నట్టు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు తెలిపారు. ఇక కరోనా ఇంతలా విజ్రుంభిస్తున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. సెలెబ్రిటీలు ఇలా ముందడుగు వేస్తె ఖచ్చితంగా జనాల్లో కూడా మార్పు వస్తుంది. ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి మరియు వర్థంతిల సందర్భంగా కళ్యాణ్ రామ్ తో కలిసి ఘాట్ ను సందర్శించడం, అక్కడ కొంచెం సేపు ఏకాంతంగా కూర్చుని రావడం జూనియర్ ఎన్టీఆర్ కి ఆనవాయితీగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా దానికి బ్రేక్ పడినట్టు అయ్యింది.

More Related Stories