డేటింగ్ యాప్స్ లో తేలిన తెలుగు యాంకర్ పిక్స్

చక్కటి చిరునవ్వుతో బుల్లితెర మీద సందడి చేసే యాంకర్ మంజూషకి మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. తెలుగు సినిమా సెలబ్రెటీ ఇంటర్వ్యూలు, ఆడియో ఫంక్షన్లతో పాటు అనేక టాక్ షోలు కూడా నిర్వహిస్తూ తెలుగు వారికి దగ్గరైంది ఈ భామ. అసలు తెలుగు మాట్లాడటమే సరిగా రాని యాంకర్లు దూసుకుపోతుంటే ఈమె కూడా ఎక్కడ తగ్గకుండా చక్కటి తెలుగు మాట్లాడుతూ అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటోంది. నిజానికి ఈమె యాంకరింగ్ కంటే ముందు సినిమాల్లో నటించింది. వాటిల్లో ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్కి చెల్లెలి పాత్రలో నటించి మెప్పించింది. రాఖీలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ తన హాట్ ఫొటోస్ని సోషల్ మీడియాలో పెడుతూ ఇంటర్నెట్ని హీటెక్కిస్తుంది. మరి ఇవి చూసైనా కనీసం దర్శకనిర్మాతలు అవకాశాలు ఇస్తారు అనుకుందో ఏమో గాని ఈ భామ హీరోయిన్లను మించి రెచ్చిపోయి స్టిల్స్ ఇచ్చేస్తోంది. ఆ స్టిల్స్ వలన ఏమైనా ఆఫర్స్ వచ్చాయో లేదో కానీ కొన్ని కొత్త తంటాలు తెచ్చిపెడుతున్నాయి. ఎందుకంటే తాజాగా మంజుషా హాట్ ఫొటోలు డేటింగ్ యాప్ లో ప్రత్యక్ష్యం అయ్యాయి. మంజుషా ఫొటోలను కొందరు డేటింగ్ యాప్ లో పోస్ట్ చేశారు. విషయం మంజుషా కు తెలిసి వెంటనే ఆమె ఈ విషయాన్ని ఫేక్ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ఫొటోలను అనుమతి లేకుండా ఉపయోగించడంతో సదరు యాప్స్ పై చర్యలకు మంజుషా సిద్దం అయ్యిందని చెబుతున్నారు.