నటిని మోసం చేశాడని శ్యామ్ కె నాయుడు అరెస్ట్

టాలీవుడ్ ప్రముఖ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు, శ్యామ్ కె నాయుడు వివాదంలో చిక్కుకున్నాడు. అర్జున్ రెడ్డి ఫేం శ్రీ సుధ అనే నటి ఆయన తనను వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సుధా ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్ ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. శ్యామ్ కె నాయుడు కూడా తన అన్న చోటా కే నాయుడు లానే సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా అనేక సినిమాలకు పని చేశారు. పోకిరి, బిజినెస్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు తో పాటు అనేక సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు. ఈయన ప్రముఖ దర్శకుడు పూరీకి బాగా సన్నిహితుడు అని చెబుతారు. ఇక ఈయన పేరు అప్పట్లో సంచలనం రేపిన హైదరాబాద్ సినీ డ్రగ్స్ విషయంలో కూడా గట్టిగా వినిపించింది. అప్పట్లో డ్రగ్ సప్లయర్ కెల్విన్ మొబైల్లో శ్యామ్ కె నాయుడు మొబైల్ నంబర్‌ను సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఆయనను కూడా రెండు మూడు రోజులు అప్పట్లో సిట్ అధికారులు విచారించారు.