English   

మహేష్ బాబు గారూ.. మరీ ఇలా అయితే కష్టం మీరు..

 Mahesh
2020-05-27 18:06:24

లాక్ డౌన్ సమయంలో రోజుకో ఫోటో విడుదల చేస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు మహేష్ బాబు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా హాయిగా తన కుటుంబంతో గడిపేస్తున్నాడు సూపర్ స్టార్. ఈ క్రమంలోనే ఈయన లుక్ అందర్నీ మాయ చేస్తుంది. అసలు ఈయన వయసు పెరుగుతుందా.. తగ్గుతుందా అనే అనుమానం వస్తుంది. మహేష్ బాబు వయసు 46.. కానీ ఈయన్ని చూస్తుంటే 20ల్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికీ అదే లుక్ మెయింటేన్ చేస్తున్నాడు సూపర్ స్టార్. ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో మరింత యంగ్ అయిపోయాడు సూపర్ స్టార్. ఇప్పుడు కూతురు సితారతో అద్దం దగ్గర దిగిన సెల్ఫీ అయితే మరింత పిచ్చెక్కిస్తుంది. ఇందులో ఈయన సితారకే అన్నయ్యలా ఉన్నాడంటే అతిశయోక్తి కాదేమో..? ఇక గౌతమ్, మహేష్ పక్కపక్కనే ఉంటే తండ్రీకొడుకులు అని మాత్రం ఎవరూ అనుకోరు. వాటిని చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం తింటున్నాడు ఈయన.. 

లేదంటే దేవుడు ఈయనొక్కడికే వయసు దాచుకునే యంత్రమేమైనా ఇచ్చాడా ఏంటి అన్నట్లుగా ఉన్నాడు సూపర్ స్టార్. అసలు వయసు కనిపించక పోగా.. ఇంకా రోజురోజుకీ యంగ్ అయిపోతున్నాడు మహేష్ బాబు. తన క్వారంటైన్ టైమ్ అంతా కుటుంబానికే ఇచ్చేస్తున్నాడు ఈయన. మరీ ముఖ్యంగా కూతురు సితారతోనే తన ఆటపాటలన్నీ సాగిస్తున్నాడు సూపర్ స్టార్. హాయిగా ఈ హాలీడేస్ ను ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు. మరో రెండు నెలల వరకు కుటుంబంతోనే ఉండనున్నాడు ఈయన. ఎలాగూ షూటింగ్స్ లేవు కాబట్టి కుటుంబమే ప్రాణం అంటున్నాడు. ఎప్పటికప్పుడు సితారతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు ఈయన చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. అసలు మహేష్ గ్లామర్ సీక్రేట్ ఏంటో తెలుసుకోవాలని చాలా మంది చూస్తున్నారు. దీనికి తన కుటుంబమే బలమని ఎప్పుడు అడిగినా చెప్తాడు మహేష్. వాళ్లు లేకపోతే తాను లేనంటాడు. అందులోనే అందం కూడా అంటున్నాడు సూపర్ స్టార్. 

More Related Stories