English   

మహేష్ రాజకీయం మొదలైందా.. సర్కార్ వారి పాట..?

mahesh
2020-05-28 07:38:55

సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయం అందుకుని జోరు మీదున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన తర్వాతి సినిమా దర్శకుడు పరశురాంతో ఉండబోతుంది. దీనిపై ఇప్పటికే అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. మే 31న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా లాంఛ్ కూడా కాబోతుంది. అయితే హంగు ఆర్భాటాలకు దూరంగా ఈ సినిమా ఓపెనింగ్ జరగనుంది. దీనికి క్రేజీ టైటిల్ ఒకటి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. మహేష్ సినిమాకు సర్కార్ వారి పాట అంటూ అదిరిపోయే టైటిల్ ఒకటి కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పరశురామ్ ఈ సినిమా కథను పూర్తిగా కమర్షియల్ కోణంలో సిద్ధం చేసాడని.. పక్కా మహేష్ ఇమేజ్ కు సరిపోయేలా ఉంటుందని తెలుస్తుంది. శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి సినిమాలు చూసి ఈయన క్లాస్ దర్శకుడు అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే దానికి ముందు ఆంజనేయులు, యువత లాంటి మాస్ సినిమాలు కూడా చేసాడు ఈ దర్శకుడు.

ఆ తర్వాతే ఫ్యామిలీ రూట్ లోకి వచ్చాడు. ఇప్పుడు మహేష్ బాబు కోసం మరోసారి కమర్షియల్ దారిలోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. సర్కార్ వారి పాట అనగానే సౌండింగ్ చాలా బాగుంది. మరోవైపు ఈ సినిమా కూడా పొలిటికల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. ఇప్పటికే భరత్ అనే నేను సినిమాలో రాజకీయాలు బాగానే చేసాడు మహేష్. ఇక సరిలేరు నీకెవ్వరులో కూడా రాజకీయ నాయకులతో పాటు పార్టీలపై కూడా అదిరిపోయే సెటైర్లు వేసాడు. ఇప్పుడు పరశురామ్ సినిమాలో కూడా మరోసారి పాలిటిక్స్ బాగానే ఉంటాయని తెలుస్తుంది. సూపర్ స్టార్ గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా కథ ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. గీత గోవిందం వచ్చిన రెండేళ్ళ తర్వాత ఈ సినిమాను మొదలు పెడుతున్నాడు పరశురామ్.

 

More Related Stories