English   

పూజా హెగ్డే ఇన్‌స్టా హ్యాక్ .. ఆ మెస్సేజ్ లు నమ్మొద్దు  

 Pooja Hegde
2020-05-28 10:22:38

సోషల్ మీడియా అంటేనే ఒక రచ్చ. ఇక్కడ మంచి వాళ్ళు ఉంటారు ఎదవలు ఉంటారు. మంచి వాళ్ళు తగిలితే పర్లేదు కానీ ఎదద్వాలు తగిలితేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే టెక్నాలజీ తెలిసిన కొందరు హీరోయిన్‌ల ఫోటోలు మార్ఫింగ్ చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు. అంతేకాక‌ మార్ఫింగ్ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం చేసి రచ్చ చేస్తుంటారు. ఇక సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్ లు హ్యాక్ కావడం కామన్ అయిపొయింది. ఈ మధ్య పలువురు హీరోయిన్ల ఎకౌంట్లు సైబర్ నేరగాళ్లు హ్యాక్ కు గురవుతున్నాయి. తాజాగా ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని పూజ తన ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

'నా అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు.. కాబట్టి ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోకండి..అలాగే ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో పంచుకోకండి' అంటూ పూజా అర్ధ రాత్రి సమయంలో ట్వీట్ చేసింది. అయితే సాధారణంగా సెలబ్రెటీస్ కి సంబందించిన అఫీషియల్ అకౌంట్స్ హ్యాక్ గురైనప్పుడు వారి అకౌంట్ తో వారికి ఉన్న ఫాలోవర్స్ లో టాప్ లో ఉన్న వారిని ట్రాప్ చేస్తుంటారు. ఆ సెలబ్రిటీ అడిగినట్టు అఫీషియల్ అకౌంట్ నుంచి మెస్సేజ్ లు వస్తే.. కొంతమంది అభిమానులు మోస పోయే అవకాశం ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా పూజా హగ్డే ట్విట్టర్ ద్వారా తన అకౌంట్ హ్యాక్ చేశారని చెప్పి మంచి పని చేసిందంటున్నారు.  
 

More Related Stories