English   

మహేష్ బాబు సినిమాకు షాకిచ్చిన పోలీసులు..

mahesh27
2020-05-28 18:29:30

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను మే 31న ఘనంగా ఓపెనింగ్ చేయాలని ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు వాళ్ల ప్రణాళికలకు పోలీసులు బ్రేక్ వేసారు. సోషల్ గ్యాదెరింగ్ కు అనుమతి లేదంటూ మహేష్ బాబు చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చారు పోలీసులు. దాంతో సైలెంట్ గా ఈ సినిమా పోస్టర్ విడుదల చేయనున్నారు. సినిమాకు పని చేస్తున్న సాంకేతిక నిపుణులతో కూడిన ఓ ఫోటో మాత్రం విడుదల చేయాలని చూస్తున్నారు. టైటిల్ లోగోను మాత్రం కేవలం ట్విట్టర్ లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించబోతున్నాడు. పరశురామ్ ఈ సినిమాను పక్కా కమర్షియల్ కథతోనే తెరకెక్కిస్తున్నాడు. ఆర్థిక నేరాల నేపథ్యంలో సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. అందుకే దీనికి సర్కార్ వారి పాట అనే టైటిల్ అనుకుంటున్నాడు దర్శకుడు పరశురామ్.

More Related Stories