English   

బాహుబలి రికార్డులు ఇంకా ఆగట్లేదురా నాయనో..

Prabhas
2020-05-29 10:56:11

బాహుబలి విడుదలై ఐదేళ్లు అవుతుంది.. రెండో భాగం వచ్చి కూడా మూడేళ్లు దాటిపోయింది. అయినా కూడా ఈ సినిమా మాత్రం ఇప్పటికీ రికార్డులు తిరగరాస్తూనే ఉంది. తెలుగు సినిమా స్థాయి నుంచి ప్రపంచ సినిమాగా ఇది రూపాంతరం చెందింది. అందుకే అంతర్జాతీయంగా మన సినిమా స్థాయిని చాటింది బాహుబలి. తొలిభాగం 500 కోట్లతో ఆగితే 'బాహుబలి: ద కన్‌క్లూజన్' ఏకంగా 2000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రం మరో ఘనతను సాధించింది. ఈ సినిమాను రష్యన్ ఫెడరేషన్ ఎంబసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ 'బాహుబలి: ద కన్‌క్లూజన్‌'కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. 

రష్యాలోని ఒక ప్రముఖ టీవీ చానల్‌లో బాహుబలి 2 టెలికాస్ట్ అవుతుందని తెలిపింది. రష్యన్ భాషలో డబ్ చేసిన వెర్షన్ అక్కడ ప్రసారం కాబోతుంది. ఆ వీడియోను షేర్ చేస్తూ రష్యాలో ఇండియన్ సినిమా పాపులారిటీ సంపాదించుకుంటోందని ట్వీట్ చేసింది రష్యన్ ఎంబెసీ. ఇప్పుడు రష్యన్ టీవీ ప్రసారం చేస్తోంది ఏమిటో తెలుసా.. రష్యన్ వాయిస్ ఓవర్‌తో 'బాహుబలి' సినిమా అంటూ వాళ్ల అకౌంట్‌లో పోస్ట్ చేశారు. రష్యన్ ఎంబసీ ఆ వీడియోను షేర్ చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో అది వైరల్‌ అయిపోయింది. మన సినిమాకు ఇంత ఆదరణ దక్కడం నిజంగానే గర్వకారణంగా ఉందంటూ కామెంట్స్ వచ్చాయి. ఏదేమైనా కూడా ఏ ఇండియన్ సినిమాకు రాని అరుదైన గౌరవాలు చాలానే సంపాదించుకుంది బాహుబలి. అందులో ఇదొకటి.. 


 

More Related Stories