టాలీవుడ్ కి కామ్న రీఎంట్రీ

ముంబై బ్యూటీ కామ్నా జెట్మలానీ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమె. రణం, బెండు అప్పారావు ఆర్ఎంపీ, కింగ్, కత్తి కాంతారావు, భాయ్ వంటి సినిమాలలో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అలరించింది. 2015లో వచ్చిన చంద్రిక అనే చిత్రంలో చివరిగా నటించిన కామ్నా ఆ తరువాత సూరజ్ నాగ పాల్ అనే అతన్ని పెళ్లి చేసుకుని సినిమాలకి దూరం అయింది. మ్యాన్ని వివాహం చేసుకున్న కామ్నా లీడ్ రోల్లో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతున్న ఆమె తాజాగా ఒక కన్నడ సినిమా ఒప్పుకుంది. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. ఇప్పుడు ఆమె తెలుగు సినిమాలో కూడా నటించనుందని అంటున్నారు. ఐదేళ్ళ తర్వాత కామ్నా నటిస్తున్న తెలుగు చిత్రం ఒక లేడి ఓరియెంటెడ్ సినిమా అని, ఇది థ్రిల్లర్ కావడంతో ప్రేక్షకులని అలరిస్తుందని భావిస్తున్నారు. నూతన దర్శకుడు ప్రభు దర్శకత్వంలో తెరక్కనున్న ఈ చిత్రంలో కామ్నా తల్లి పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రముఖ న్యాయ కోవిదుడు రాం జెఠ్మలానీకి ఈమె మనవరాలు అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.