English   

మేడపై వ్యవసాయం.. సమంత అక్కినేని లాక్‌డౌన్ ప్లాన్..

sam
2020-05-30 07:19:05

సమంత అక్కినేని సినిమాలతోనే కాదు బయట పనులతో కూడా చాలా బిజీగా ఉంటుంది. పైగా రెండు నెలలుగా సినిమాలు కూడా లేవు. షూటింగ్స్ కూడా లేవు.. దాంతో ఇంటికే పరిమితం అయిపోయారు సమంత చైతూ. కావాల్సినట్లుగా మార్చుకుని లాక్ డౌన్ పీరియడ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఇద్దరూ. ఇన్నాళ్లూ కేవలం నటిగానే ఉన్న సమంత ఇప్పుడు రైతుగా మారబోతుంది. సమంత చైతూకు హైదరాబాద్‌లో మంచి ఇల్లు ఉంది. విశాలంగా ఉన్న ఈ ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ సహా సకల సదుపాయాలు ఉన్నాయి. మురళీ మోహన్ తన కొడుకు కోసం కట్టుకున్న ఇంటిని నాగార్జున రిఫరెన్సుపై నాగ చైతన్యకు అమ్మేసాడు. ఇప్పుడు ఈ ఇంటి టెర్రస్‌పై ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూరగాయలు పండించేందుకు సిద్ధమైపోయింది సమంత అక్కినేని.

దానికి కావాల్సిన మెళకువలు కూడా నేర్చుకుంటుంది ఈ భామ. దీన్ని మిద్దె తోట అని కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం సిటీస్ లో ఇది బాగా ఫేమస్. ఇప్పుడు సమంత కూడా ఇదే చేయబోతుంది. మిద్దె తోటతో తనకు కావాల్సిన కూరగాయలను పండించాలని చూస్తుంది. అలా పండించిన కూరగాయలనే వంటకు ఉపయోగించుకోవాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాను మిద్దె పంట నుంచి కూరగాయాలను పండిస్తున్నట్టు ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది కూడా. ఇలా మేడపైనే వ్యవసాయం చేసి మరికొందరికి ఆదర్శంగా నిలుస్తుంది సమంత. ఇప్పటికే ఈ మిద్దె తోట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. చాలా పెద్ద వాళ్లు కూడా ఈ తోటను వేస్తున్నారు. మరి ఇందులో సమంత ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలిక.

More Related Stories