English   

బాలకృష్ణకి గతం గుర్తు చేస్తున్న నెటిజన్లు..

balakrishna
2020-05-30 14:43:26

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం బాలకృష్ణ చేసిన కామెంట్స్ వేడివేడిగా ఉన్నాయి. ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్ కు తనను పిలవకుండా శ్రీనివాస్ యాదవ్ తో కూర్చుని భూములు పంచుకుంటున్నారా అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. బాలయ్య లాంటి సీనియర్ హీరోను పిలవకుండా ఇండస్ట్రీలో మీటింగ్ ఎలా జరుపుతారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్లకు నెటిజన్లు సరైన సమాధానం చెబుతున్నారు. బాలకృష్ణ అభిమానులు గతం మర్చిపోయినట్లున్నారు.. ఒకసారి గుర్తు చేసుకోండి అంటూ అప్పట్లో జరిగిన లేపాక్షి ఉత్సవాలను మళ్లీ సీన్ లోకి తీసుకొస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అనంతపురం జిల్లాలో బాలయ్య నేతృత్వంలో లేపాక్షి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. అప్పట్లో ఆ వేడుకలకు కేవలం బాలయ్యకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారు. వాళ్ళు వచ్చారు అనడం కంటే వాళ్లను మాత్రమే పిలిచారు అనడం కరెక్ట్. పైగా అన్ని దగ్గరుండి తానే చూసుకున్నాడు బాలకృష్ణ.

ఆ సందర్భంగా చిరంజీవికి ఆహ్వానం పంపలేదా అని మీడియా అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆహ్వానం పంపలేదు అనేసి ఊరుకోకుండా.. ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో తనకు తెలుసని.. ఎవరినీ అనవసరంగా తన నెత్తిన ఎక్కించుకోను.. ఆ అవసరం కూడా నాకు లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలయ్య. అప్పట్లో ఆయన చేసిన ఈ కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. మరి అప్పుడు అధికారం తన చేతుల్లో ఉందని చిరంజీవితో సహా ఇంకా చాలా మందిని పిలవకుండానే లేపాక్షి ఉత్సవాలు చేసిన బాలయ్య.. ఇప్పుడు తనను పిలవలేదు అని నోరు పారేసుకోవడం ఎంతవరకు సబబు అంటూ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

More Related Stories