మహేష్ బాబుతో లైవ్ చాట్.. ఫ్యాన్స్ గేట్ రెడీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఆయన పుట్టిన రోజు, సినిమా అప్డేట్స్ విషయంలో వారు ట్రెండ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అంత యాక్టివ్ గా ఉండే తన అభిమానులకి శుభవార్త అందించాడు మహేష్ బాబు. అదేమిటంటే తనతో లైవ్ చాట్ చేసే అవకాశం ఇచ్చాడు మహేష్. రేపు సాయంత్రం ఐదు గంటలకు తన ఇన్స్టా గ్రామ్ అఫీషియల్ అకౌంట్ తో లైవ్ చాట్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. లైవ్ చాట్ చేయండి, మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను అంటూ ప్రకటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆయన తరువాతి సినిమలాకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నా, త్వరలో ప్రారంభం కాబోయే పరశురామ్ తో సినిమా గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మహేష్ బాబును రేపు అడగచ్చు. ఇక రేపు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. బహుశా మహేష్ ఫాన్స్ కి ఇంతకు మించిన అవకాశం ఉండదేమో. ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి.