English   

సమంత టెన్త్ క్లాస్ రిపోర్ట్ కార్డ్ ..వామ్మో మైండ్ బ్లాకే 

Samantha
2020-05-30 10:04:47

ఏం మాయ చేశావే సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన అకౌంట్ లో వేసుకొని రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా నాగ చైతన్య ని మాయ చేసి తనవాడ్ని చేసుకుంది సమంతా. ఇక సినిమాల్లో సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి పాత్రనైనా అలవోకగా నటించేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అయితే సమంత మంచి నటి మాత్రమే కాదు. మంచి స్టూడెంట్‌ కూడా అని ప్రూవ్ చేసుకుంది సమంత. 

స్కూల్‌, కాలేజీలో ఇచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్టులను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాని ప్రకారం సీఎస్‌ఐ సెయింట్‌ స్టీఫెన్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌ సమంత పదోతరగతి చదగగా మ్యాథ్స్ -పార్ట్‌-1 లో 100కు 100 మార్కులు రాగా..మ్యాధ్స్ పార్టు-2 లో 99 మార్కులు రావడం విశేషం. ఇక ఇంగ్లీష్‌ లో 90 మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులు వచ్చాయి. అలాగే హోలీ ఎంజెల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతి చదవగా అక్కడ కూడా సబ్జెక్టులా వారీగా మంచి ప్రతిభనే కనబర్చింది. సమంత ఫేస్‌బుక్‌ పేజీలో కనిపిస్తున్న మార్కుల జాబితాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీరూ చూసేయండి మరి.

More Related Stories