English   

ఆ స్టార్ హీరో కూతురు..ఆ స్టార్ క్రికెటర్ కి మధ్య ప్రేమేనా 

 KL Rahul
2020-05-30 11:05:36

సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి హీరో మూవీతో బాలీవుడ్ తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక ఆయన కొడుకు అహన్ శెట్టి కూడా హిందీ చిత్రసీమలో తన లక్ పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు సునీల్ శెట్టి కూతురు ఒక స్టార్ క్రికెటర్ తో ప్రేమలో పడిందని అంటున్నారు. ఆ క్రికెటర్ మరెవరో కాదు కేఎల్ రాహుల్.  ఆ మధ్య అతియా శెట్టితో కలిసి ఉన్న ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గత నెల్లో అతియా తన ఇన్‌స్టాగ్రామ్‌ని వేదిక పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పింది, అంతేకాక మై పర్సన్‌ రాహుల్‌ అంటూ అతనితో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్‌ చేయడం అప్పట్లో రచ్చ లేపిందనే చెప్పాలి. దాంతో నెటిజన్లు మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారా? మీ జంట బాగుందంటూ కామెంట్లు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. ఎవరైనా సన్నిహితులు అడిగితే మేం ఒట్టి స్నేహితులమే అని సమాధానం చెబుతున్నా వీరిద్దరి మధ్య ఏదో ఉందనే గుసగుసలు మాత్రం ఆగడం లేదు. మరి ఇంతకీ ఇద్దరూ ప్రేమలో ఉన్నారా లేక స్నేహితులా అనేది ఎప్పటికి తేలుతుందో ? మరి. 
 

More Related Stories