English   

చిరంజీవి ఏమైనా స్వలాభం కోసం చేస్తున్నాడా.. ఎందుకు సీన్ చేస్తున్నారు.. 

Tammareddy Bharadwaj
2020-05-30 16:20:01

రెండు మూడు రోజులుగా తెలుగులో ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ఇవి. బాలయ్య, నాగబాబుపై కూడా ఈయన ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఈ ఇద్దరూ చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు చెప్పాడు తమ్మారెడ్డి. చిరంజీవి ఇంట్లో మీటింగ్ గురించి ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారనేది తనకు అర్థం కావడం లేదని చెప్పాడు ఈయన. దాసరి ఉన్నపుడు ఈయన ఇంట్లో ఎన్నోసార్లు మీటింగ్స్ జరిగాయి. అప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు.. మరిప్పుడు ఎందుకు చిరంజీవి ఇంట్లో మీటింగ్ జరిగితే ఉలిక్కిపడుతున్నారనేది అర్థం కావడం లేదని చెప్పాడు భరద్వాజ్. చిరంజీవి ఏమైనా స్వలాభం కోసం పెట్టాడా లేదు కదా.. ఆయన కూడా ఇండస్ట్రీ కోసమే కదా పెట్టాడు.. మరి అలాంటప్పుడు బాలకృష్ణ అనని మాటల్ని కూడా అన్నారని చూపిస్తున్నారు.. ఆయన వ్యక్తిగతంగా అన్న మాటలపై తాను స్పందించను కానీ.. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ చాలా స్నేహంగా ఉన్నారు.. బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరితోనూ మాట్లాడాము.. ఈ సమస్యకు అక్కడే పరిష్కారం దొరికిందని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు ఈయన. ఇండస్ట్రీకి మంచి జరుగుతుందనుకుంటే చిరంజీవే కాదు ఎవ్వరితోనైనా కలసి కడవడానికి అంతా సిద్ధంగానే ఉన్నారని చెప్పుకొచ్చాడు తమ్మారెడ్డి. 

More Related Stories