English   

సర్కార్ వారి పాట పోస్టర్.. మహేష్ మెడపై ఆ టాటూ ఏంటి..?

mb
2020-05-31 12:41:36

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 27వ సినిమాకు సర్కారు వారి పాట అనే టైటిల్‌ కన్ఫర్మ్ చేసారు. మే 31న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఈ పోస్టర్ లో సినిమాకు పని చేస్తున్న వాళ్ల లిస్ట్ విడుదల చేసారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పోస్టర్ లోనే చాలా విషయాలు చెప్పాడు దర్శకుడు పరశురామ్. ఈ సినిమా కథ కూడా పక్కా కమర్షియల్ వేలోనే సాగుతుంది. ఇన్ని రోజులు ఎమోషనల్ కథలు రాసుకుంటూ వచ్చిన పరశురామ్.. పక్కా మాస్ కథను సిద్ధం చేసాడు. సూపర్ స్టార్ ఇమేజ్ కు సరిపోయేలా ఓ ఆర్థిక నేరగాడి కథ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈయనపై పోలీసుల కన్ను ఎప్పుడూ ఉంటుందని.. మోసం చేసే పాత్రలో మహేష్ నటిస్తున్నాడని తెలుస్తుంది.

డబ్బుకు గుర్తుగానే మెడపై రూపాయి చిహ్నాన్ని టాటూగా ముద్రించుకుంటాని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మహేష్ చేసిన సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండే కథ ఇది అంటున్నారు దర్శక నిర్మాతలు కూడా. పైగా చెవిపోగుతో కనిపిస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఆసక్తి పుడుతుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కథానాయికగా కియారా అద్వానీని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తుంది. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌కి కూడా మంచి కిక్ ఖాయం అంటున్నాడు దర్శకుడు పరశురామ్. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు సినిమాకు మళ్లీ థమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2021లో ఈ సర్కారు వారి పాట విడుదల కానుంది.

More Related Stories