మామగారికి వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పిన సుధీర్ బాబు..

హీరో సుధీర్ బాబు అంటే సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు అని చాలా మందికి తెలుసు. ఆయన చిన్న కూతురును పెళ్లి చేసుకున్నాడు సుధీర్. సినిమాల్లోకి రాకముందే ఆయన సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు అయ్యాడు. ఆ తర్వాత హీరో అయ్యాడు.. ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే మే 31న తన మామగారు కృష్ణ పుట్టిన రోజు కావడంతో ఆయనకు అందరిలా కాకుండా కాస్త వెరైటీగా శుభాకాంక్షలు తెలిపాడు సుధీర్ బాబు. ఈయన చేసిన పని చూసి నెటిజన్లతో పాటు అభిమానులు కూడా ఆహా ఓహో అంటున్నారు. సూపర్ స్టార్ నటించిన కృష్ణ 100వ చిత్రం.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన కళాఖండం 'అల్లూరి సీతారామరాజు' సినిమా క్లైమాక్స్ డైలాగ్‌ను డబ్ స్మాష్ చేసి సుధీర్ బాబు అభినందనలు తెలిపాడు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ మధ్యే ఎన్టీఆర్ 'దానవీరశూరకర్ణ' సినిమాలో పవర్ఫుల్ డైలాగ్‌కు డబ్స్మాష్ చేసాడు సుధీర్. ఇప్పుడు మామగారి సినిమాను వాడేసుకున్నాడు. ఈయన ప్రస్తుతం నానితో కలిసి వి సినిమా చేసాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్డౌన్ ఎత్తేస్తే ఇది రిలీజ్ అవుతుంది.