చిరంజీవి, రామ్ చరణ్‌పై తేనెటీగల దాడి..

లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలల నుంచి ఇంట్లోనే ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్. అయితే ఇప్పుడు మాత్రం మరో పనిపై బయటికి వెళ్లారు. అప్పుడే చిరంజీవి, రామ్ చరణ్ సహా ఉపాసనపై కూడా తేనెటీగలు దాడి చేసాయి. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తం అయ్యారు. దోమకొండలో ఉపాసన తాత మరణించిన తర్వాత అక్కడికి వెళ్లిన వీళ్లపై అక్కడ తేనెటీగలు దాడి చేశాయి. వారం రోజుల కింద ఉపాసన తాత ఉమాపతి మరణించారు. ఆయన చనిపోవడంతో ఉపాసన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉమాపతి మరణం కారణంగానే 14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించే వేడుకలో కనిపించలేదు చిరంజీవి. తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు సినిమా పెద్దలంతా కలిసి వచ్చారు దీనికోసం. కానీ చిరు మాత్రం సమీప బంధువు మరణం కారణంగా రాలేదని చెప్పాడు. ఆ సమయంలోనే దోమకొండ వెళ్లిన చిరంజీవి, ఉపాసన, రామ్ చరణ్‌పై తేనెటీగల దాడి జరిగింది. వెంటనే వైద్యం తీసుకోవడంతో ప్రస్తుతం బాగానే ఉన్నారు.