English   

ఫ్యాన్స్ తో మహేష్ లైవ్ చాట్...ఫ్యాన్స్ క్రేజీ ప్రశ్నలకి మహేష్ ఇంటెలిజెంట్ ఆన్సర్స్ 

Mahesh Babu
2020-06-01 09:04:21

నిన్న నటుడు కృష్ణ బర్త్‌ డే సందర్భంగా ఆయన కుమారుడు, టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో లైవ్ చాట్ ద్వారా సరదాగా ముచ్చటించారు. ‘ఆస్క్‌ మీ యువర్‌ క్వశ్చన్స్‌!’ పేరుతో నిన్న సాయంత్రం నిర్వహించిన లైవ్ ‌చాట్‌ లో అభిమానుల ప్రశ్నలకు మహేష్ తన దైన శైలిలో సమాధానాలిచ్చారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. ఒకసారి ఆయనతో ఫ్యాన్స్ ఎలాంటి విషయాలు చాట్ చేశారు అనే విషయం చూద్దాం.

అభిమాని : "సర్, మీకు నమ్రత మేడమ్ పై ఎంత ప్రేమ ఉంది?"
మహేష్ : "నీకు పెళ్లయిందా... ముందు నాకు సమాధానం చెప్పు!" అంటూ నవ్వుతున్న ఎమోజీ పోస్ట్ చేశారు.
అభిమాని : సమంత నటన నచ్చిందా, రష్మిక నటన నచ్చిందా ?
మహేష్ : ఇద్దరి నటన నచ్చింది, అద్భుతమైన నటీమణులు.
అభిమాని : కృష్ణ గారి గురించి ఒక్క మాటలో చెప్పండి  
మహేష్ : ఆయన గురించి చెప్పేందుకు ఒక్క మాట సరిపోదు.
అభిమాని : మీకు ఇష్టమైన కలర్‌ ఏంటి ?
మహేష్ : నాకు ఇష్టమైన కలర్‌ బ్లూ
అభిమాని : మీకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటి ?
మహేష్ : నాకు ఇష్టమైన ఫుడ్‌ హైదరాబాద్‌ బిర్యాని.
అభిమాని : క్వారంటైన్‌ లైఫ్‌ ఎలా ఉంది?
మహేష్ : చాలా గొప్ప అనుభూతినిచ్చింది.  
అభిమాని : మీ ఫేవరెట్‌ గేమ్‌ ఏంటి ?
మహేష్ : నా ఫేవరెట్ గేమ్‌ టెన్నిస్‌, గోల్ఫ్‌, గౌతమ్‌ తో కలిసి ఆన్‌లైన్‌‌ బేస్‌బాల్‌ ఆడతా.
అభిమాని : మీ పిల్లల కోసం మీరు తయారు చేసే బెస్ట్‌ డిష్‌ ఏంటి ?
మహేష్ : మ్యాగీ నూడిల్స్
అభిమాని : మీకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?  
మహేష్ : మా నాన్న
అభిమాని : మిమ్మల్ని జేమ్స్‌ బాండ్‌ మూవీలో చూడాలనుకుంటున్నా, భవిష్యత్తులో ఆ సినిమా వస్తుందా?
మహేష్ : మీకు ఇష్టమైతే, నాతో చేయాలనుకుంటే నువ్వే మంచి స్క్రిప్ట్‌‌ పంపించు.
అభిమాని : మీకు టీ 20, టెస్ట్‌ ఫార్మాట్లలో ఏది ఇష్టం?
మహేష్ : టెస్ట్‌ ఫార్మాట్‌
అభిమాని : భవిష్యత్తులో పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తారా?
మహేష్ : తప్పకుండా చేస్తాను. నాకు ఫేవరైట్‌ దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన మంచి స్క్రిప్ట్ తో వస్తారని ఎదురు చూస్తున్నా
అభిమాని : కర్ణాటక అభిమానుల గురించి ఒక్కమాటలో చెప్పండి?
మహేష్ : సూపర్‌ కూల్‌
అభిమాని : ఎస్. ఎస్. రాజమౌళితో సినిమా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ?
మహేష్ : తప్పకుండా. నేను కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నా
అభిమాని : మైండ్‌ బ్లాక్‌  సాంగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ డాన్స్ గురించి మీరేమంటారు?
మహేష్ : చాలా బాగా చేశాడు.
అభిమాని : మీ బెస్ట్‌ ఫ్రేండ్‌ ఎవరు?
మహేష్ : నమ్రత
అభిమాని : మీ నిక్‌ నేమ్ ?‌
మహేష్ : నాని
అభిమాని : మీ పెట్‌ డాగ్స్‌‌ పేర్లు ?
మహేష్ : నోబిటా, ప్లూటో
అభిమాని : భవిష్యత్తులో గౌతమ్‌ హీరోగా నటిస్తారా?
మహేష్ : దానికి కాలమే సమాధానం  చెబుతుంది.
అభిమాని : మీకు ఇష్టమైన క్రికెటర్లు ?
మహేష్ : ధోనీ, సచిన్, కోహ్లీ
ఇలా మహేష్ తనదైన శైలిలో తన అభిమానులకి ఆన్సర్స్ ఇచ్చారు.
 

More Related Stories