English   

పూరీ జగన్నాథ్‌తో సినిమాపై మహేష్ బాబు అదిరిపోయే రిప్లై..

 Mahesh
2020-06-01 12:13:00

పూరీ జ‌గ‌న్నాథ్, మహేష్ బాబు.. ఈ కాంబినేషన్ తలుచుకోగానే రెండు సూపర్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఒకటి చరిత్ర సృష్టించిన సినిమా పోకిరి అయితే.. మరోటి మహేష్ బాబులో కూడా బ్యాడ్ బాయ్ ను ఆవిష్కరించిన సినిమా బిజినెస్ మేన్. ఈ రెండు సినిమాలతో మహేష్ ఇమేజ్ కూడా బాగానే పెరిగిపోయింది. మ‌హేష్ కు న‌టుడిగా.. స్టార్ గా ఇమేజ్ పెంచిన సినిమాలు ఇవి. ఇలాంటి స‌మ‌యంలో మూడో సినిమాకు రంగం సిద్ధం చేయాల‌ని చాలా రోజులుగా పూరీ భావిస్తున్నాడు. దీనికోసం జ‌న‌గ‌ణ‌మ‌న సినిమా క‌థ సిద్ధం చేసాడు కూడా. సూప‌ర్ స్టార్ తో ఈ చిత్రం చేస్తున్న‌ట్లు అప్ప‌ట్లో అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ కూడా వ‌చ్చింది. అయితే ఆ త‌ర్వాత అది ప‌ట్టాలెక్క‌లేదు. ఎందుకంటే పూరీ జ‌గ‌న్నాథ్ వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్నాడు కాబ‌ట్టి. 

మ‌హేష్ కూడా అందుకే ధైర్యం చేయ‌లేదు. ఎలాగూ ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ అయింది కాబ‌ట్టి మ‌హేష్ సినిమా చేస్తారా మ‌రి అని ఆ మధ్య పూరీని ఓ ఇంట‌ర్వ్యూలో అడిగితే సంచ‌ల‌న స‌మాధానాలు ఇచ్చాడు. మ‌హేష్ బాబుకు మేం హిట్స్ ఉన్న‌పుడే గుర్తుంటాం.. అప్పుడే ఆయ‌న సినిమాలు చేస్తాడు క‌దా అన్నాడు. మ‌రిప్పుడు ఇస్మార్ట్ హిట్టైంది క‌దా చేస్తారా అంటే అప్పుడు ఓకే అన‌డానికి నాకు కూడా ఓ కారెక్ట‌ర్ కండాలి క‌దా అంటూ ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పాడు పూరీ. ఇది చూసాకా ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో అర్థ‌మైపోతుంది. మరోవైపు మహేష్ బాబు తాజాగా అభిమానులతో మాట్లాడుతూ.. పూరీతో సినిమా చేస్తారా అంటే ఎందుకు చేయను.. ఆయన నా ఫేవరేట్ దర్శకుల్లో ఒకరు.. భవిష్యత్తులో మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని సమాధానమిచ్చాడు. కానీ మహేష్ కోరినా కూడా పూరీ ఇప్పుడు కథ సిద్ధం చేసేలా కనిపించడం లేదు. 

More Related Stories