English   

గౌతమ్ హీరో అవుతాడా.. మహేష్ బాబు ఊహించని రిప్లై..

Mahesh Babu
2020-06-01 16:45:53

లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడో లేదో తెలియదు కానీ ఇండస్ట్రీలో హీరో కొడుకు మాత్రం కచ్చితంగా హీరో అవుతున్నాడు. 20 ఏళ్లు వచ్చాయంటే చాలు చదువులు అన్నీ పూర్తి చేసుకుని హాయిగా సినిమాల్లోకి వచ్చేస్తున్నారు కుర్రాళ్లు. ఇప్పటికే చాలా మంది వచ్చారు.. ఇంకా వస్తుంటారు.. వస్తూనే ఉంటారు కూడా. రాబోయే కాలంలో పవన్, మహేష్ బాబు లాంటి హీరోల వారసులు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఇప్పటికే మహేష్ బాబు వారసుడు గౌతమ్ నేనొక్కడినే సినిమలో నటించాడు కూడా. ఆ సినిమాలో మనోడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఫ్యూచర్ లో కచ్చితంగా ఈ కుర్రాడు హీరో అవుతాడని అభిమానులు ఇప్పట్నుంచే అంచనాలు వేసి పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో సోషల్ మీడియాలో మాట్లాడిన మహేష్ బాబు.. వాటికి ఆసక్తికరమైన సమాధానాలు కూడా చెప్పాడు. ఈ క్రమంలోనే ఓ అభిమాని మీ అబ్బాయి గౌతమ్ హీరో అవుతాడా అని అడిగాడు. దానికి మహేష్ ఊహించని రిప్లై ఇచ్చాడు. దానికి తొందరేం లేదు.. కాలమే దీనికి సమాధానం చెప్తుందని చెప్పుకొచ్చాడు మహేష్. ఇప్పుడు ఇలాగే అంటారు కానీ వయసు పెరుగుతుంటే వద్దన్నా హీరో అయిపోతాడులే అంటున్నారు అభిమానులు. 

More Related Stories