English   

రాజమౌళి కోసం ఎదురు చూస్తున్నానంటున్న మహేష్ బాబు..

mahesh babu
2020-06-01 18:25:36

తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించాడు మహేష్ బాబు. సోషల్ మీడియాలో వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అందులో కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటికి కూడా కాదనకుండా చెప్పాడు సూపర్ స్టార్. ఇదిలా ఉంటే రాజమౌళి సినిమా గురించి కూడా ప్రశ్న వచ్చింది.. దానికి మహేష్ కూడా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. తాను కూడా చాలా రోజులుగా ఈ కాంబినేషన్ కోసం వేచి చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు ఈయన. రాజమౌళి కోసం వెయిట్ చేస్తున్నానని జవాబిచ్చాడు మహేష్ బాబు. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో అభిమానులు కూడా చూడానుకుంటున్న కాంబినేషన్ రాజమౌళి, మహేష్ బాబు. ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు దర్శక ధీరుడితో పని చేసారు కానీ మహేష్ బాబుకు మాత్రం ఈ అవకాశం రాలేదు. ఎప్పట్నుంచో ఆయన వేచి చూస్తున్నాడు కూడా. 

చాలా కాలం కింద కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈ ఇద్దరి కలయికలో సినిమా ఉంటుందని అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది కానీ అది కుదర్లేదు. అయితే ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి.. ఆ తర్వాత వెంటనే మహేష్ బాబు సినిమా చేస్తానంటున్నాడు. ఇప్పటి వరకు ఈయన ప్రభాస్ తో మూడు.. ఎన్టీఆర్ తో మూడు.. చరణ్, నితిన్, సునీల్, నాని లాంటి హీరోలతో ఒక్కో సినిమా చేసాడు. పవన్, బన్నీ, మహేష్ లాంటి హీరోలతో రాజమౌళి పని చేయలేదు. పవన్ కళ్యాణ్ తో తన సినిమా చేయలేను అని ఓపెన్ గానే చెప్పేసాడు రాజమౌళి. 

ఇక ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాకి సిద్ధమవుతున్నాడు. అప్పట్లో మహేష్ బాబుతో సినిమా చేస్తే తాను జేమ్స్ బాండ్ కథ చేస్తానని చెప్పాడు రాజమౌళి. ఇప్పుడు ఈ తరహా కథనే రాజమౌళి టీం సూపర్ స్టార్ కోసం సిద్ధం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత మరో రెండు మూడు సినిమాలకు కూడా ఆయన కమిట్మెంట్ ఇచ్చాడు. అయితే రాజమౌళి చేస్తానంటే ఆ సినిమాలను మహేష్ బాబు ఆపేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Related Stories