English   

పూరీ జగన్నాథ్ చెప్పిన లయన్ బాలయ్యేనా.. నాగబాబుపై సెటైర్లు..

 Puri Jagannadh
2020-06-01 21:15:25

పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాతో పాటు రాబోయే సినిమాలకు కూడా కథలు సిద్ధం చేసుకుంటున్నాడు. అందులో బాలయ్య సినిమాకు కూడా కథ ఒకటి సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ను తనకు కావాల్సినట్లుగా ప్లాన్ చేసుకుని బిజీగా ఉన్న పూరీ.. ఇప్పుడు ఓ వివాదాస్పద ట్వీట్ చేసాడు. 'బీ ఏ లయన్' అనే కాన్సెప్ట్ తో ఈయన పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులకు అద్ధం పడుతుంది. బాలయ్యను పిలవకుండా మీటింగులు జరుపుకున్న వాళ్లకు సెటైర్లు వేసినట్లుగా అర్థమవుతుంది. సింహం లేకుండా అవన్నీ ఏం చేస్తున్నాయో అనే అర్థం వచ్చేలా పూరీ ఈ వీడియోను పోస్ట్ చేసాడంటున్నారు అభిమానులు. 

అడవిలో బతకడం ఎలా అంటూ వీడియో స్టార్ట్ అయింది. ఈ అడవిలో 'అతి పెద్ద జంతువు' ఏది అంటే నేను 'ఏనుగు' అని చెప్పడం విన్నాను.. 'పొడవైన జంతువు' ఏదంటే నేను 'జిరాఫీ' అని చెప్పడం విన్నాను.. తెలివైన జంతువు ఏదంటే నేను 'నక్క' అని చెప్పడం విన్నాను.. వేగంగా పరిగెత్తే జంతువూ ఏదని అడిగితే నేను చిరుత అని చెప్పడం విన్నాను.. మరి ఇప్పటి వరకు చెప్పిన అన్ని అద్భుతమైన క్వాలిటీస్‌లో 'లయన్' లేదు కదా అంటే.. లేకపోతేనేం సింహాన్ని కింగ్ ఆఫ్ ది జంగిల్ అంటారు.. అది 'అడవికి రాజు'.ఎందుకంటే 'సింహం' సాహసి.. బోల్డ్.. నమ్మకంగా నడుస్తుంది.. సింహం ప్రతీదాన్ని దాన్ని సాహసంగా ఎదుర్కొంటుంది.. ఎవరికీ భయపడడు.. నన్నెవరూ ఆపలేరని ముందడుగు వేస్తుంది.. సింహం తనకు వచ్చిన అవకాశాన్ని ఎప్పటికీ చేజార్చుకోదు.. మనం సింహం నుండి ఏమి నేర్చుకోవాలంటే వేగంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు.. స్మార్ట్ కావాల్సిన అవసరం లేదు.. తెలివైన వాడికి అవ్వాల్సిన అవసరం లేదు.. నీకు ఉండాల్సింది.. కావాల్సిందల్లా ధైర్యం.. బోల్డ్ నెస్.. నీపై నీకు నమ్మకం.. ఇవన్నీ సింహానికి ఉంటాయి.. ఇప్పుడు అది బయటకి తీసే టైం వచ్చింది. నీలో కూడా ఒక సింహం ఉన్నాడు అంటూ ఎండ్ అవుతుంది. 

ఇప్పుడు ఉన్నట్లుండి ఈ వీడియో పోస్ట్ చేయడానికి కారణమేంటనేది అంతు చిక్కని విషయం. సాధారణంగా బాలయ్యను లయన్, నటసింహం అంటారు. ఇక్కడ పూరీ చెప్తున్న సింహం బాలయ్యేనా అనే అనుమానాలు వస్తున్నాయి. అన్నింటికి మించి ఇండస్ట్రీలో మీటింగ్స్‌ అన్నీ బాలయ్య లేకుండానే జరిగాయి. అక్కడ సింహం లేకపోయినా కూడా సింహమే అంటూ వీడియో పోస్ట్ చేసాడు పూరీ జగన్నాథ్.. దీన్నిబట్టి బాలయ్యను ఉద్ధేశ్యించి ఈ వీడియో పెట్టాడంటున్నారు అభిమానులు కూడా. మరి దీనిపై పూరీ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో మరి.

More Related Stories