English   

మీటూ అంటూ బయటకొచ్చిన మరో నటి 

 kalyani poornitha
2020-06-02 07:27:27

బాషలతో సంబంధం లేకుండా దాదాపు అందరు హీరోయిన్స్ గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి సమయం వచ్చినప్పుడు బయట పెడుతున్నారు. మీటూ అంటూ పెద్ద ఉద్యమం మొదలైన నేపథ్యంలో ఎంతో మంది హీరోయిన్స్ తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి మీడియా ముందు చెప్పారు. పలువురు స్టార్ హీరోయిన్స్ సైతం ఆశ్చర్యకరంగా తాము లైంగిక వేదింపులకు గురయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఒకటి రెండు సినిమాలతో మెరిసి సైలెంట్ అయిపోయిన తమిళ నటి ఒకరు కూడా అలాంటి కామెంట్సే చేశారు. పరిశ్రమలో కొందరు తనను లైంగింకగా వేధించారని ఆ వేధింపుల తట్టుకోలేక నటనకు దూరమయ్యానని నటి కళ్యాణి చెప్పుకొచ్చింది. తమిళంలో ‘జయం’, ‘అలై తండా వానమ్‌’, ‘ఎస్‌ఎంఎస్‌’ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి కళ్యాణి తెలుగులో కూడా మళ్లీ మళ్లీ అనే చిత్రంలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

అయితే కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న కళ్యాణి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు బయట పేఎఇన్ది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలోనే ప్రభుదేవాతో కలిసి ‘అలై తండా వానమ్‌’ చిత్రంలో నటించాన్న ఆమె హీరోయిన్‌గా మంచి అవకాశాలు వస్తోన్న సమయంలో కొంతమంది వ్యక్తులు సినిమాల్లో నటించాలంటే కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలని చెప్పారని ఆ మాటలతో బాధకలిగి సినీ ఇండస్ట్రీకి దూరమయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉండడంతో టీవీ సీరియల్స్ వారు నటించమని అడిగారని, అలా పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నానని ఆమె తెలిపింది.  
 

More Related Stories