మోహన్ బాబు ట్వీట్ ..సింగపూర్ నుంచి హైదరాబాదుకు స్పెషల్ ఫ్లైట్

ప్రస్తుత కరోనా సమయంలో ఎవరికీ వారు తమకు నచ్చిన, తోచిన విధంగా అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. అలాగే సింగపూర్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు సింగపూర్ తెలుగు సొసైటీ ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు నటుడు మోహన్ బాబు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. వచ్చే వారం ఈ విమానం సింగపూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరి రానున్నట్టు ఆయన అందులో పేర్కొన్నారు.
సింగపూర్లో చిక్కుకుని హైదరాబాద్ రావాలనుకుంటున్న వారిని వివరాలివ్వమంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ విమానంలో రావాలనుకుంటున్న వారు తమ పూర్తి పేరు, ఫోన్ నెంబర్ను singhydplane@gmail.comకు పంపాల్సిందిగా ఆయన కోరారు. ఇప్పటికే భారత ప్రభుత్వం ఇప్పటికే వందే భారత్ మిషన్ పేరిట విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తోంది. అయితే వాటిలో కూడా విదేశాల నుంచి వస్తున్న వారు తమ ప్రయాణ ఖర్చులను తామే భరించాల్సి ఉంటుంది. అందుకే ఇలా ఉచిత సర్వీసు ఏమైనా పెట్టారా ? లేక ఇది కూడా పెయిడ్ సర్వీసెనా అనే విషయాలు తెలియాల్సి ఉంది.