English   

జూనియర్ ఎన్టీఆర్  టీడీపీ ఎంట్రీ పై బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్

 Balakrishna NTR
2020-06-02 08:08:30

తాజాగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిన నందమూరి బాలకృష్ణ ఒక యూ ట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సుమారు 60 నిమిషాలు ఉన్న ఈ ఇంటర్వ్యూ లో తన లైఫ్ స్టైల్ గురించి అలాగే తాజాగా జరిగిన పరిణామాల గురించి ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన డైలీ రొటీన్ గురించి ఆయన మాట్లాడుతూ తెల్లవారు జమున 3.30 గంటలకు లేచి గంటన్నర వ్యాయామం, 3గంటలు పూజ .8.30 కి కుటుంబ సభ్యులతో కలిసి టిఫిన్ చేసిన తరువాత కేన్సర్ హాస్పిటల్ పనులు చూసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. బోయపాటి సినిమా వారం రోజులు ఫైట్ షూట్ చేసామన్న ఆయన మరో వారంలో తాను పాడిన మరో పాటను రిలీజ్ చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

 మా కుటుంబ సభ్యులు అంతా కలసి నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడమని ఒక వేళ ఆ ప్రస్తావన వచ్చినా చాలా తక్కువ అని ఆయన చెప్పుకొచ్చారు. హిందూపూర్ ను చాలా డవలప్ చేశాను కాబట్టే నన్ను మళ్లీ ఎన్నుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక ఏపీ ప్రభుత్వం ఎక్కువ కాలం వుండదని ప్రజలు తిరగ బడతారని బాలయ్య చెప్పుకొచ్చారు. ఆనాడు చంద్రబాబు తెలంగాణాను ఎంతో అభివృద్ది చేశారని, ఆ ఫలాలు ఈ ప్రభుత్వం అనుభవిస్తుందని ఏ పార్టీ అధికారం లో వున్నా డవల ప్ మెంట్ ముఖ్యమని ఆయన అన్నారు. 

ఇక జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కి సినీ యాక్టర్ గా బోలెడు భవిష్యత్ వుందని, అయినా రాజకీయాల్లోకి రావడం అనేది జూనియర్ వ్యక్తిగత విషయం అని, అతని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. నటుడిగా భవిష్యత్ ఉన్న నేపథ్యంలో, వృత్తిని వదులుకుని రాజకీయాల్లోకి రమ్మని చెప్పలేనని బాలయ్య చెప్పుకొచ్చాడు. తన కూతురు బ్రాహ్మణి రాజకీయాల లోకి రాదన్న ఆయన మల్టీ స్టారర్ సినిమా లేవి నేను చెయ్యటం లేదని ప్రస్తుతం నాధ్యసంతా బోయపాటి సినిమా మీదనే అని చెప్పుకొచ్చాడు. 

More Related Stories