అల్లు అర్జున్ మహేష్ బాబు కథలు మారిపోయాయి

గీతగోవిందం సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు డైరెక్టర్ పరశురామ్. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం వంద కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా విడుదలై ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు పరశురామ్ మరో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు. మహేష్ బాబుతో సినిమా చేయాలని గీతగోవిందం తర్వాత పరశురామ్ చాలా కాలం వెయిట్ చేశాడని ఆ సమయంలో అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలకు కథ వినిపించాడని ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత మహేష్ తో సినిమా చేయనున్నాడని ప్రచారం జరగడం, అందుకు తగ్గట్టే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావడం జరిగిపోయింది. అయితే పరశురామ్ ఈ కథకు తొలుత అనుకున్నది మహేష్‌ను కాదట.
ఆయనకు మొదటి నుంచీ గీతా ఆర్ట్స్‌లో బన్ని హీరోగా ఓ సినిమా చెయ్యాలని బలమైన కోరిక ఉండేదట. అందుకే ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కథను సిద్ధం చేశారట. కానీ, ఏవో కారణాలతో ఈ స్క్రిప్ట్ బన్నికి నచ్చలేదని దీంతో ఇదే కథను మహేష్‌కు వినిపించగా ఆయన నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. అలా స్టైలిష్‌స్టార్ కోసం సిద్ధం చేసిన ‘సర్కారు వారి పాట’ను సూపర్‌స్టార్ అందుకున్నారని అంటున్నారు. ఇలా కథలు చేతులు మారడమన్నది చిత్ర సీమలో సాధారణ విషయమే. కానీ మహేష్ వద్దనుకున్న సుకుమార్ కధ బన్నీ చేయడం బన్నీ వద్దనుకున్న పరశురామ్ కధ మహేష్ చేయడం ఆసక్తికరంగా మారింది.