అందాల లావణ్యమా.. అపురూపమైన సోయగమా..

అబ్బబ్బా.. ఆ కళ్లలో కసి చూడండి.. ఒక్కొక్కరిని చూపులతోనే చంపేస్తా అన్నట్లు చూస్తుంది అందాల రాక్షసి. హను రాఘవపూడి ఏ ముహూర్తాన ఆ టైటిల్ పెట్టాడో కానీ నిజంగానే అందాల రాక్షసి అనే పేరుకు నిజంగానే న్యాయం చేస్తుంది లావణ్య త్రిపాఠి. అందుకే విజయాలు లేకపోయినా కూడా తన అందాలతో బండి లాక్కొచ్చేస్తుంది. సినిమాలు లేనపుడు ఖాళీ టైమ్ లో ఇలా ఫోటోషూట్లు చేసి ప్రేక్షకుల గుండె కోస్తూ ఉంటుంది ఈ అందాల రాక్షసి. ఇండస్ట్రీలో హిట్లు లేనిదే ఏ హీరోయిన్ ను పట్టించుకోరు. కానీ లావణ్యకు మాత్రం ఈ సూత్రం వర్తించదు. మిస్టర్.. రాధా.. యుద్ధం శరణం.. ఇంటలిజెంట్ లాంటి ఫ్లాపులతో ఈ భామ రేస్ లో వెనకబడిపోయింది.
కానీ ఫ్లాపులున్నా కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇక 2019 ఈమెకు బాగానే కలిసొచ్చింది. ఆ మధ్య నిఖిల్ హీరోగా వచ్చిన అర్జున్ సురవరం సినిమా బాగానే ఆడింది. అయితే ఆఫర్ల వేటలో ప్రస్తుతం కాస్త వెనకబడింది లావణ్య. అందుకే మళ్లీ ఫోటోషూట్స్ వైపు అడుగులు వేస్తుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడూ హాట్ ఫోటోషూట్ లతో అమ్మాయిగారు రచ్చ చేస్తున్నారు. మొత్తానికి ఒకేసారి అవకాశం ప్లస్ అందం కలిస్తే కెరీర్ సూపర్ హిట్ కావడం గ్యారెంటీ అన్నమాట.