English   

జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్నంత చెత్త ఫ్యాన్స్ ఎక్కడ ఉండరంటున్న బ్యూటీ..

 Meera Chopra
2020-06-03 19:27:39

రెండు రోజులుగా మీరా చోప్రా పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను విమర్శిస్తూ ట్రెండింగ్ అవుతుంది. అప్పట్లో బంగారం సినిమాతో పాటు నితిన్ హీరోగా వచ్చిన మారో సినిమాలో కూడా నటించింది మీరాచోప్రా. కానీ తెలుగులో ఈమెకు కోరుకున్న గుర్తింపు రాలేదు. దాంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే సాధారణంగా లాక్ డౌన్ సమయంలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మను తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ఒక నెటిజన్ అడిగాడు. దానికి సమాధానంగా మహేష్ బాబు పేరు చెప్పింది మీరాచోప్రా. దాంతో ఆ నెటిజన్ మరి ఎన్టీఆర్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. దానికి ఆమె వెంటనే నాకు ఎన్టీఆర్ ఎవరో తెలియదు అంటూ సమాధానం ఇచ్చింది. చాలా సేపు వరకూ ఈ ముచ్చట ఇలాగే కొనసాగింది. 

ఇక తెల్లారి లేచి చూస్తే సోషల్ మీడియాలో ఈమెపై పెద్ద యుద్ధమే ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. అంత స్టార్ డమ్ ఉన్న హీరో ఎవరో నీకు తెలియదా.. సౌత్ ఇండస్ట్రీ లో కూడా నటించావు కదా నీకు ఎన్టీఆర్ ఎవరో తెలియదా అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. అక్కడితో ఆగకుండా కొందరు అసభ్య పదజాలం కూడా వాడారు. దాంతో మీరా చోప్రాకు చిర్రెత్తుకొచ్చింది. అందుకే ఎన్టీఆర్ అభిమానులపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తనకు వచ్చిన ట్వీట్స్ లో నిన్ను రేప్ చేస్తాం.. చంపేస్తాం.. మీ అమ్మానాన్నలకు కరోనా వచ్చి చచ్చిపోవాలి అంటూ నీచమైన పదాలు కూడా ఉన్నాయంటూ మీరాచోప్రా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

ఎన్టీఆర్ అంటే అందరికీ తెలియాలా.. మా అమ్మ నాన్నలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదు అంటూ అభిమానులను విమర్శించింది మీరాచోప్రా. అసలు ఇలాంటి అభిమానులను పెట్టుకొని ఎన్టీఆర్ ఎలా స్టార్ హీరో అయ్యాడో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఈమె. తన అభిమానులనే కంట్రోల్ చేసుకోలేని వాడు స్టార్ హీరో ఎలా అవుతాడు అంటూ ప్రశ్నించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి ఇది ఎంత దూరం వెళుతుందో చూడాలి. 

More Related Stories