English   

కేసీఆర్ మంచోడే.. కానీ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు..

Balakrishna
2020-06-03 19:50:13

ఒక యూట్యూబ్ ఛానల్ కు బాలకృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. ఇంటర్వ్యూ విడుదలై మూడు రోజులవుతున్నా కూడా ఇంకా దాని ప్రకంపనలు మాత్రం బయట కనిపిస్తూనే ఉన్నాయి. దాదాపు గంటపాటు సాగిన ఇంటర్వ్యూలో చాలా విషయాలపై కూలంకషంగా మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేసాడు బాలకృష్ణ. సినిమాలతో పాటు రాజకీయానికి సంబంధించిన విషయాలు కూడా ఏమాత్రం దాచుకోకుండా బయట పెట్టాడు బాలయ్య. ముఖ్యంగా తెలంగాణ విషయంలో కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏపీలో ప్రభుత్వం అంటూ లేదు.. అక్కడ రాక్షస రాజ్యం నడుస్తుంది.. ఐదేళ్లపాటు ఈ ప్రభుత్వం నిలబడదు అంటూ వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు బాలకృష్ణ. మరోవైపు తెలంగాణపై ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. 

ఇక్కడ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఒకప్పుడు తెలుగుదేశం కష్టపడితే ఇప్పుడు దాని ప్రతిఫలం తెలంగాణ అనుభవిస్తుంది అంటూ కామెంట్ చేశాడు. అప్పట్లో తెలుగుదేశం హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. ఇక్కడికి వచ్చిన ఐటీ కంపెనీలు పరిశ్రమలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు అంటూ గుర్తు చేశాడు బాలయ్య. వాటికి సంబంధించిన ఫలాలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై కొందరు తెరాస నాయకులు రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. జీవితాంతం చంద్రబాబు నాయుడు మాత్రమే తెలంగాణను అభివృద్ధి చేయలేదంటూ.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ చాలా అభివృద్ధి చేశాడంటూ వెనకేసుకొస్తున్నారు. ఏదేమైనా కూడా బాలయ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు చాలా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. 

More Related Stories