English   

చిరంజీవి ఆచార్య విషయంలో కొరటాల శివ అసంతృప్తి..

Koratala Siva
2020-06-04 09:13:18

ఏమో ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆచార్య విషయంలో కొరటాల శివ అంత సంతృప్తిగా లేరని.. అనవసరంగా ఈ సినిమా ఒప్పుకున్నాను అంటూ సన్నిహితుల దగ్గర చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవితో సినిమా చేయాలనే అత్యుత్సాహంలో దాదాపు మూడేళ్లు ఖర్చు చేసుకున్నాడు కొరటాల శివ. ఆయన ఓకే అంటే ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ భరత్ అనే నేను సినిమా తర్వాత రెండేళ్లకు పైగా చిరంజీవి కోసం వేచి చూస్తూనే ఉన్నాడు కొరటాల శివ. చివరికి ఆచార్య సినిమా పట్టాలెక్కిన తర్వాత కూడా అనుకోకుండా కొన్ని బ్రేకులు పడ్డాయి. ఇక ఇప్పుడు ఏకంగా లాక్డౌన్ పుణ్యమా అని మూడు నెలలుగా షూటింగ్ జరగడం లేదు. ఇంతా చేస్తే ఇప్పటి వరకు ఆచార్య సినిమా కేవలం 40 శాతం కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది. మరో 60 శాతం బ్యాలెన్స్ ఉంది. అందులోనే రామ్చరణ్తో చేయాల్సిన నెల రోజుల షెడ్యూల్ కూడా బాకీ ఉంది. 

మరోవైపు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. షూటింగ్ తిరిగి మొదలైతే ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా తన సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకధీరుడు. ఇలాంటి సమయంలో ఆచార్య కోసం రామ్ చరణ్ నెల రోజులు ప్రత్యేకంగా డేట్స్ కేటాయిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. భరత్ అనే నేను తర్వాత వేరే హీరోతో సినిమా కమిట్ అయి ఉంటే ఈ పాటికి అది రిలీజ్ అయి కూడా ఉండేది. కానీ చిరంజీవితో సినిమా చేయాలనే ఆసక్తి కొరటాల కెరీర్లో ఊహించని గ్యాప్ తీసుకొచ్చింది. లాక్ డౌన్ తర్వాత ఎలాంటి బ్రేకులు తీసుకోకుండా సింగిల్ షెడ్యూల్లో ఆచార్యను పూర్తి చేయాలని చూస్తున్నాడు కొరటాల శివ. దీనికి చిరంజీవి నుంచి కూడా పూర్తి సహకారం వస్తుందని ఆయన నమ్ముతున్నాడు. 

ఇప్పటికే ఈ సినిమా కోసం 20 కోట్లతో ప్రత్యేకంగా నిర్మించారు. దాదాపు 40 రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు. పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది ఆచార్య రావడం అసాధ్యం. 2021 సమ్మర్ సీజన్ కు ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. అంటే దాదాపు మూడేళ్ల తర్వాత మరో సినిమాతో వస్తున్నాడు ఈ దర్శకుడు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఇంత భారీ గ్యాప్ తీసుకోవడం మంచిది కాదని విశ్లేషకులు కూడా కొరటాలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. దాంతో తర్వాత సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు.

More Related Stories