సాహో దర్శకుడు కూడా పెళ్ళికి రెడీ అయిపోయాడు

టాలీవుడ్ సెలబ్రిటీలకు ఈ కరోనా లాక్ డౌన్ బాగా కలిసొచ్చినట్టుంది. ఎప్పుడూ సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే మన వాళ్ళు వరుసగా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ కూడా త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడని అంటున్నారు. ఈ నెల 10న సుజీత్ నిశ్చితార్థం కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు. తాను ప్రేమించిన ప్రవల్లిక అనే డాక్టర్ తో వచ్చే వారం ఎంగేజ్మెంట్ చేసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటి దాకా ప్రేమలో ఉన్న వీరికి పెద్దల అంగీకారం ఇప్పుడు లభించడంతో లాక్డౌన్ సమయాన్ని అందుకు వాడుకోవాలని ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. ప్రవల్లిక వృత్తిరీత్యా డాక్టర్ కాగా నాని హీరోగా చేసిన కొన్ని సినిమాలకి ఆమె స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పని చేసినట్టు చెబుతున్నారు. ఆ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాగా తెరకేక్కాల్సిన లూసిఫర్ రీమేక్ తో సుజీత్ బిజీగా ఉన్నాడు. చేసింది రెండు సినిమాలే అయినా రెండో సినిమా ప్రభాస్ తో కావడంతో బాలీవుడ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.