English   

అక్కినేని బ్రదర్స్ ను నమ్ముకున్న అల్లు అరవింద్

 allu arvind
2020-06-04 12:48:34

టాలీవుడ్ లో వన్నాఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ ‘ఆహా’ అనే ఓటిటి ద్వారా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ ‘ఆహా’ ఓటిటిలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సినిమాలు ఏమైనా వచ్చాయా ? అంటే అవి కార్తీ “ఖైదీ”, నిఖిల్ “అర్జున్ సురవరం” అనేవి రెండే. ఆహా పెట్టిన కొత్తలో ఇక నుంచి మనం అమెజాన్ లాంటి బయటి సంస్థలను నమ్ముకోవాల్సిన పనిలేదని, అరవింద్ లాంటి పెద్ద మనిషి ఈ మార్కెట్ లోకి దిగాడు కాబట్టి పెద్ద సినిమాలన్ని ‘ఆహా’లోనే వస్తాయని అనుకున్నారు. కానీ ‘ఆహా’ రోజు రోజుకి నిరాశపర్చడంతో దీనిని నిలబెట్టే పనోలో పడ్డాడు అరవింద్. 

ఇప్పటికే అరవింద్ కొంత మంది దర్శకుల చేత వెబ్ సిరీలు చేయిస్తున్నాడు. అంతేకాక ఆసక్తికరంగా ఉన్న సినిమాలను ముందే దక్కించుకునే పనిలో పడ్డాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న లవ్ స్టోరీ సినిమాను మంచి మొత్తం చెల్లించి డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి డిజిటల్ గా కూడా బాగా వర్కౌట్ అవుతుందని అరవింద్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో పాటు గీతా ఆర్ట్స్-2 లో అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ ను కూడా ఆహా లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నడాని అంటున్నారు. 

More Related Stories