English   

స్టార్ హీరోకు కరోనా పరీక్షలు.. ఫలితం చూసి అభిమానులు షాక్..

Prithviraj Sukumaran
2020-06-04 13:43:44

కరోనా వైరస్ కు రాజు-పేద తేడా లేదు. అది అందరినీ ఒకేలా చూస్తుంది బ్రిటన్ యువరాజు అయినా బిక్షం ఎత్తుకునే వాడైన అందరికీ కరోనా సమానం. అందుకే జాగ్రత్తగా ఉండటం తప్ప ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఒక స్టార్ హీరోకు కరోనా టెస్ట్ చేశారు వైద్యులు. ఆడు జీవితం అనే మలయాళ సినిమా కోసం జోర్డాన్ వెళ్ళిన పృథ్వీరాజ్ సుకుమారన్.. టీమ్ తో పాటు ఆయన అక్కడే నెల రోజులకు పైగా చిక్కుకుపోయారు. ఈ మధ్యే కేరళ ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలతో వాళ్లు తిరిగి ఇండియాకు వచ్చారు. వచ్చిన వెంటనే క్వారంటైన్ కి వెళ్లిన ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నాడు. తాజాగా వచ్చిన రిపోర్టులను బట్టి ఆయన నెగిటివ్ అని తేలింది. దాంతో ఊపిరిపీల్చుకున్నారు అభిమానులు. కుటుంబ సభ్యులు కూడా సంతోషం లో మునిగిపోయారు. 

నెల రోజులకు పైగా విదేశాల్లో ఉండి కరోనా రాకుండా జాగ్రత్త పడిన ఈ హీరోని చూసి అభిమానులు కాలర్ ఎగరేసేస్తున్నారు. కేరళలో కొందరు రాజకీయ నాయకులు కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తనతో పాటు తన టీంలో ఏ ఒక్కరికి కూడా ఈ మహమ్మారి సోకకుండా తన వంతు బాధ్యత తీసుకున్నాడు పృథ్వి రాజ్. ఏదేమైనా ఈయనకు కరోనా టెస్టులు చేయడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో క్షణాల్లోనే ఈ న్యూస్ వైరల్ అయిపోయింది.

More Related Stories