English   

ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి సారి..అంతా జక్కన్న వలనే  

jr NTR
2020-06-05 11:29:47

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఇప్పుడు మంచి పీక్ స్టేజ్ లో ఉంది. రభస సినిమా తరువాత నుండి మనోడికి ఒక్క ఫ్లాప్ కూడా పడలేదు. ఫ్లాప్ ల సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ కెరీర్ మొదటి నుండి ఏడాదికి రెండు సినిమాలు చేయడం అలవాటు. 2012 నుండి ఈ ట్రెండ్ మారింది కానీ, అంతకు ముందు 2001 నుండి ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేసే వాడు. కెరీర్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇన్నేళ్లు గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు ఎన్టీఆర్. కేవలం 2009లో మాత్రమే ఒక సంవత్సరం మిస్ చేసాడు. అప్పుడు కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా యాక్సిడెంట్ అయింది. దాంతో 2009లోనే రావాల్సిన అదుర్స్ కాస్తా 2010 సంక్రాంతికి విడుదలైంది. కానీ ఇప్పుడు మాత్రం జక్కన్న పుణ్యమా అని తారక్ గ్రాప్గ్ లో తొలిసారి రెండేళ్లు ఖాళీగా ఉండిపోయింది. రాజమౌళి కోసం రెండు కాలెండర్ ఇయర్స్ వదిలేసాడు జూనియర్. 2018లో అరవింద సమేత సినిమాతో వచ్చిన ఎన్టీఆర్ 2021 దాకా సినిమా రిలీజ్ చేయలేడు. దీంతో ఫస్ట్ టైమ్ రెండేళ్ళు అంటే 2019, 20 ఇయర్స్ జూనియర్ కెరీర్‌ లో ఖాళీగా ఉండిపోయాయి. 2021 సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ విడుదల కానుంది. అయితే ఇప్పుడు వచ్చి గ్యాప్‌ వెంటవెంటనే పూర్తి చేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్.  
 

More Related Stories