English   

ఆమెకు మా అవసరం ఉంది..అందుకే అంటోన్న సన్నీ

Sunny Leone
2020-06-05 19:39:25

పోర్న్ స్టార్ నుంచి వెండితెర నటిగా మారిన సన్నీ లియోన్ బాలీవుడ్‌ ను ఒక ఊపు ఊపింది. బిగ్‌ బాస్ లాంటి రియాలిటీ షోతో బుల్లి తెర మీద కూడా తనదైన మార్క్ వేసుకుంది. తన గతం గురించి నిస్సంకోచంగా మాట్లాడగల ఆమె అప్పట్లో పోర్న్ మూవీస్ చేయడమే ఇప్పుడు తను బాలీవుడ్ లో నిలబడడానికి కారణం అని గర్వంగా  చెప్పుకుంటుంది సన్నీ. అయితే సన్నీ గత కొద్ది కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టుంది. అయితే కరోనా సమయాన తన భర్త డేనియల్‌ వెబర్‌, పిల్లలతో కలిసి సన్నీ అమెరికా వెళ్ళింది. ప్రస్తుతం ఆమె కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్న ఆమె తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. డేనియల్‌ కుటుంబ సభ్యుల కోసమే తాము ఇండియా నుంచి అమెరికా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. 

అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతులు దొరికిన వెంటనే ముంబయి వచ్చేస్తామని ఆమె చెప్పుకొచ్చింది. ముంబయి వదిలిరావడం ఎంతో బాధ కలిగించిందన్న ఆమె చాలా రోజుల పాటు ఆలోచించిన తర్వాతే అమెరికా వెళ్లానని తన భర్త కుటుంబ సభ్యులు అమెరికాలోనే ఉన్నారని భర్త వాళ్లమ్మకు మా అవసరం ఎంతో ఉందని ఈ కరోనా నేపథ్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని అందుకే నేను అమెరికా వెళ్లానని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతులు ఇచ్చిన వెంటనే ఇండియాకి వచ్చేస్తామని సన్నీ చెప్పుకొచ్చింది.

More Related Stories