English   

మీరాకు కేటీఆర్ అండ...వారి పై కఠిన చర్యలు

KTR Meera Chopra
2020-06-05 18:15:19

ఫ్యాన్స్ అత్యుత్సాహం ఆయా హీరోలకు తలనొప్పిగా మారింది. తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్  నటి మీరా చోప్రా సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల చిట్ చాట్‌లో పాల్గొన్న హీరోయిన్ మీరా చోప్రా తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టమని తెలిపారు. ఎన్టీఆర్‌ ఎవరో తెలియదని ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మీరాచోప్రా చెప్పడంతో వివాదం మొదలైంది. ఈ మాట అనడంతో తారక్‌ అభిమానులు మీరా చోప్రాను ట్రోలింగ్‌ చేయడం మొదలుపెట్టారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎవరో తనకు తెలియదని చెప్పడమే మీరా చోప్రా చేసిన మిస్టేక్. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఇదిప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

తీవ్ర అసభ్య పదజాలంతో తనకు మెసేజ్‌లు చేశారని మీరా ఆరోపించారు. కొందరు అభిమానులు ఏకంగా బెదిరింపులకు కూడా దిగినట్టు చెప్పారు. గ్యాంగ్ రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు మీరా చోప్రా. నెటిజన్ల ట్వీట్లతో ఆవేదనకు గురైన మీరాచోప్రా ట్విటర్‌ వేదికగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.తనను దూషిస్తూ ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేసిన స్క్రీన్ షాట్స్‌ను తీసి సైబర్ క్రైమ్ పోలీసులకు షేర్ చేశారు. అంతేకాదు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని మంత్రి కేటీఆర్‌కు మీరా చోప్రా ట్వీట్ చేశారు. యాసిడ్ ఎటాక్, గ్యాంగ్ రేప్ చేస్తామని తనను బెదిరిస్తున్నారని కేటీఆర్‌ కు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశానని మంత్రి కేటీఆర్‌కు తెలిపారామె.  మీరా చోప్రా ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, సీపీని కేటీఆర్‌ ఆదేశించారు. మంత్రి కేటీఆర్‌ స్పందించడంతో ఆయనకు థ్యాంక్స్ చెప్పారు మీరా చోప్రా. మహిళల రక్షణ ఎంతో ముఖ్యమన్నారు మీరా. క్రిమినల్స్‌ వదిలిపెట్టొద్దని మంత్రి కేటీఆర్‌ని కోరారు మీరా.
 

More Related Stories