English   

అందరూ కలిసి చిరంజీవిని బలిపశువును చేశారా..

Chiranjeevi balakrishna
2020-06-05 20:46:34

మేత మేసింది ఒకరు.. కూత కూసింది ఒకరు.. మధ్యలో బలైపోయింది మరొకరు.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అందరూ కలిసి అన్యాయంగా చిరంజీవిని బలిపశువును చేశారు అంటూ ఆయన అభిమానులు కూడా మండి పడుతున్నారు. అతడేమైనా సొంత లాభం కోసం ప్రభుత్వంతో మాట్లాడాడా.. ఇండస్ట్రీ కోసమే కదా చర్చించాడు.. అలాంటప్పుడు చిరంజీవికి అండగా  ఎందుకు అందరూ నిలబడలేకపోతున్నారు.. బాలయ్య చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు.. అనవసరంగా మధ్యలో చిరంజీవిని ఎందుకు ఇరికిస్తున్నారు అంటూ కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కావాలనే చిరంజీవిని మధ్యలో ఇరికించారని.. తెలివిగా చాలామంది సీన్ లోంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో చిరంజీవి బాగా హర్ట్ అయ్యాడని.. అందుకే ఇకపై ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలలో తలదూర్చకూడదనే నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఇండస్ట్రీకి సంబంధించిన మీటింగ్స్ కానీ మరే ఇతర విషయాలు కానీ తనతో చర్చించవద్దంటూ సినీ పెద్దలకు మెగాస్టార్ వినమ్రంగా విన్నవించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక పెద్దగా అన్నీ తానే అయి ముందుండి నడిపిస్తున్న అంటే భూములు పంచుకున్నారనే చెడ్డపేరు తనపై వచ్చిందని చిరంజీవి బాగా ఫీల్ అయినట్లు ఆయన సన్నిహితులు కొందరు మీడియాతో మాట్లాడారు. బాలయ్య తొందర పాటుతనం చిరంజీవిని చిన్నబుచ్చుకునేలా చేసిందని.. ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటున్నారు వాళ్లు. ఏదేమైనా కూడా బాలయ్య చేసిన వ్యాఖ్యల తర్వాత చిరంజీవి కూడా ఇండస్ట్రీ విషయాలకు దూరంగా జరగాలని ఫిక్స్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదేగాని జరిగితే బాలకృష్ణ చేసిన కామెంట్స్ తో చిరంజీవి చాలా హర్ట్ అయ్యాడని అర్థం చేసుకోవాల్సిందే.

More Related Stories