English   

స్నేహకు బిల్లుతో షాకిచ్చిన తమిళనాడు ఎలక్ట్రిసిటీ అధికారులు..

Electricity Bill
2020-06-06 06:41:14

లాక్ డౌన్ మొదలైన తర్వాత కరెంటు బిల్లుల విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయంటూ సామాన్యులు కూడా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మే నెలల్లో రీడింగు ఇవ్వలేదు. దాంతో ఇష్టం వచ్చినట్లు కరెంటు బిల్లులు ప్రజలపై మోపారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నటి స్నేహ భర్త ప్రసన్న కూడా ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టాడు. కరెంట్ బిల్స్ తో తమిళనాడు ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని ఎంత మంది అనుకుంటున్నారు అంటూ ఒక ట్వీట్ చేశాడు ప్రసన్న. దీనికి సామాన్యుడి నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ అధికారులు కూడా ఈ ట్వీట్ చూసి ఆయనకు రిప్లై ఇచ్చారు. దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది. మూడు నెలలకు కలిపి ప్రసన్న ఇంటికి ఏదైనా 42 వేల బిల్లు పంపించారు ఎలక్ట్రిసిటీ అధికారులు. దాంతో అది చెల్లించిన తర్వాత ఈ ట్వీట్ చేశాడు ప్రసన్న. ఈ కరెంటు బిల్లులతో ప్రజలు పడుతున్న అవస్థలు ప్రభుత్వానికి తెలియజేయాలని ట్వీట్ చేశాను కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చాడు ప్రసన్న. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ మాత్రం బాగా వైరల్ అవుతుంది. మరోవైపు ఆయన కట్టిన 42 వేల కరెంటు బిల్లు కూడా బాగానే వైరల్ అవుతుంది. 

More Related Stories