రజనీకాంత్ కు కరోనా.. తాట తీస్తాం అంటున్న ఫ్యాన్స్..

ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ తో కామెడీ చేయడం అంత మంచిది కాదు. అలాంటిది ఒక బాలీవుడ్ నటుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ను అడ్డుపెట్టుకొని కరోనా వైరస్ తో కామెడీ చేసాడు. దాంతో సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని రోహిత్ రాయ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఒక్క క్షణం పాటు ఆయన అభిమానులందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇది ఎప్పుడు జరిగింది.. రజనీకాంత్ కు కరోనా పాజిటివ్ రావడం ఏంటి అంటూ అందరూ షాక్ అయ్యారు. అయితే అది అబద్ధమని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న తలైవా అభిమానులు రోహిత్‌పై మండి పడుతున్నారు. ఎలాంటి టైంలో జోకులు చేయాలో తెలియదా అంటూ ఆయన పై సీరియస్ అవుతున్నారు అభిమానులు. రజనీకాంత్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.. కానీ కరోనా క్వారంటైన్లో ఉంది అని పోస్ట్ పెట్టాడు. సోషల్ మీడియా లో రజనీ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఇలాంటి జోకులు చాలానే వస్తుంటాయి అయితే కరోనా వైరస్ ని అడ్డు పెట్టుకొని రోహిత్ ట్రై చేసిన కామెడీ ఎవరికీ నచ్చలేదు. ఇలాంటి పనికిమాలిన చెత్త జోకులు పోస్ట్ చేస్తే ఇంటికొచ్చి తాట తీస్తాం అంటూ రజనీకాంత్ అభిమానులు ఆయనకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆయన అభిమానులకు క్షమాపణ చెప్పాడు.