జై చిరంజీవ చిన్నారి ఇప్పుడు బాగా రెచ్చిపోతుందిగా..

జై చిరంజీవ సినిమాలో చిన్నారి పాపగా అందరికీ పరిచయమైన బ్యూటీ గుర్తుంది కదా.. ఈమె పేరు శ్రీయ శర్మ కేరాఫ్ హిమాచల్ ప్రదేశ్. అప్పట్లో 8 ఏళ్ల వయసున్నపుడు ఇండస్ట్రీకి వచ్చింది ఈ పాప. ఇప్పుడు 23 ఏళ్లు.. జై చిరంజీవ వచ్చి కూడా 14 ఏళ్లు దాటిపోయింది. దాంతో ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది శ్రీయ. కాలేజ్ ఏజ్ లోనే హీరోయిన్ అయిపోయింది ఈ భామ. వచ్చీ రావడంతోనే పాలమీగడ లాంటి అందాలను కెమెరాలకు అరువు ఇచ్చేస్తుంది. అవకాశాలు కాస్త తక్కువగానే వస్తోన్నా.. వచ్చినపుడు మాత్రం అందాల ఆరబోతనే నమ్ముకుంటుంది శ్రీయశర్మ. ఈ మధ్యే ఓ హాట్ ఫోటోషూట్ చేసింది ఈ భామ.
ఈ ఫోటోలిప్పుడు నెట్ లో వైరల్ అయిపోయాయి. అయితే ఎంతగా అందాలు ఆరబోసినా.. ఇంకా మొహంలో పసితనం పోలేదంటున్నారు ప్రేక్షకులు. ఆ మధ్య శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రీయ. ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం చూస్తుంది. మరి ఈ బ్యూటీ అందాల ఆరబోత అవకాశాలు తెచ్చిపెడుతుందా లేదా అనేది చూడాలిక..!