English   

సురేష్ బాబు చెప్పినట్లు చేస్తే థియేటర్లు తెరుసుకోవచ్చు..

Suresh Babu
2020-06-06 13:56:41

ఇది కరోనా వైరస్ సమయం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చూపించినా అసలుకే మోసం వస్తుంది. పైగా సినిమా ఇండస్ట్రీలో భౌతిక దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎవరికి వారే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి తోడు సినిమా షూటింగ్ తో పాటు థియేటర్లో ఓపెనింగ్ కూడా జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికే మూడు నెలలుగా థియేటర్లన్నీ మూసేశారు. ఆగస్టు నుంచి థియేటర్ల రీఓపెనింగ్ ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. కానీ నిర్మాత సురేష్ బాబు మాత్రం మరోలా ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే షూటింగ్ కు అంత అనుకూలంగా లేవు.

ఉన్నఫలంగా థియేటర్లు తెరిచినా కూడా ఆడియన్స్ వస్తారో రారో క్లారిటీ లేదు. అందుకే షూటింగ్ మొదలైన రెండు నెలలకు గాని థియేటర్లు తెరవకూడదు అని చెబుతున్నాడు సురేష్ బాబు. రెండు మూడు నెలలు షూటింగ్ చేసుకున్న తర్వాత చాలా సినిమాలు విడుదలకు వస్తాయి.. అప్పటికి కరోనా వైరస్ కూడా మన అదృష్టం బాగుంటే కాస్త కంట్రోల్ అవుతుంది. అలాంటి సమయంలో థియేటర్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నాడు సురేష్ బాబు. అలాకాకుండా తొందరపడి ఆగస్టులో థియేటర్లు ఓపెన్ చేస్తే జనం రాకపోతే అసలుకే మోసం వస్తుంది.. ఇప్పటికే ఉన్న నష్టాలు చాలవన్నట్లు ఎగ్జిబిటర్లపై మరింత భారం పడుతుంది అంటున్నాడు ఈ నిర్మాత. ఎటు చూసుకున్న కూడా షూటింగ్స్ మొదలైన రెండు నెలలకు థియేటర్ లో ఓపెన్ చేస్తే అంతా బాగుంటుందని ప్రభుత్వానికి కూడా తన సూచనగా చెబుతున్నాడు సురేష్ బాబు. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. 

More Related Stories